ప్రభన్యూస్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’కు టికెట్ ధరలు పెంపు.. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఎంత పెంచారంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ‘ది ప్యారడైజ్’పై కూడా అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు విడుదలకు ముందే ‘ది ప్యారడైజ్’కు సంబంధించి టికెట్ ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు స్వల్పంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కోరగా.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతులు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా నైజాం ఏరియాకు సంబంధించిన టికెట్ ధరల పెంపుపై కీలక అప్డేట్ వచ్చింది.

తెలంగాణలో ‘ది ప్యారడైజ్’కు టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది. సినిమా అధికారికంగా సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే నైజాం ప్రాంతంలో మాత్రం ప్రేక్షకులకు ఒక రోజు ముందుగానే సినిమాను చూసే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 23 సాయంత్రం 6:30 గంటల నుంచే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించినట్లు సమాచారం.

ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 24 నుంచి మొదటి నాలుగు రోజుల పాటు టికెట్ ధరపై అదనంగా రూ.48 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంటే సినిమా విడుదలైన తొలి నాలుగు రోజులు పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత మరో ఆరు రోజుల పాటు టికెట్ ధరపై అదనంగా రూ.23 పెంచుకునేందుకు అనుమతి లభించింది. దీంతో మొదటి పది రోజుల్లో రెండు దశల్లో టికెట్ ధరలు కొనసాగనున్నాయి.

మల్టీప్లెక్స్ థియేటర్లకు కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చారు. సెప్టెంబర్ 24 నుంచి మొదటి నాలుగు రోజుల పాటు అదనంగా రూ.95 పెంచుకునే అవకాశం కల్పించారు. అనంతరం మరో ఆరు రోజుల పాటు రూ.45 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో నైజాం మార్కెట్‌లో మొదటి వారంతో పాటు రెండో వారంలోనూ పెరిగిన టికెట్ ధరలు కొనసాగనున్నాయి.

మొత్తంగా చూస్తే ‘ది ప్యారడైజ్’కు నైజాం మార్కెట్‌లో ప్రీమియర్స్‌తో పాటు టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతులు లభించాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమా కావడంతో ఓపెనింగ్ డే వసూళ్లపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రీమియర్స్ నుంచే సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? నాని కెరీర్‌లో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 10:01 pm Digital Edition : Prabhanews
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’కు టికెట్ ధరలు పెంపు.. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఎంత పెంచారంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 20, 2026 9:56 PM ISTనాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. News18నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ‘ది ప్యారడైజ్’పై కూడా అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మరోవైపు విడుదలకు ముందే ‘ది ప్యారడైజ్’కు సంబంధించి టికెట్ ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు స్వల్పంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కోరగా.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతులు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా నైజాం ఏరియాకు సంబంధించిన టికెట్ ధరల పెంపుపై కీలక అప్డేట్ వచ్చింది.తెలంగాణలో ‘ది ప్యారడైజ్’కు టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది. సినిమా అధికారికంగా సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. అయితే నైజాం ప్రాంతంలో మాత్రం ప్రేక్షకులకు ఒక రోజు ముందుగానే సినిమాను చూసే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 23 సాయంత్రం 6:30 గంటల నుంచే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించినట్లు సమాచారం.ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 24 నుంచి మొదటి నాలుగు రోజుల పాటు టికెట్ ధరపై అదనంగా రూ.48 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంటే సినిమా విడుదలైన తొలి నాలుగు రోజులు పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత మరో ఆరు రోజుల పాటు టికెట్ ధరపై అదనంగా రూ.23 పెంచుకునేందుకు అనుమతి లభించింది. దీంతో మొదటి పది రోజుల్లో రెండు దశల్లో టికెట్ ధరలు కొనసాగనున్నాయి.మల్టీప్లెక్స్ థియేటర్లకు కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చారు. సెప్టెంబర్ 24 నుంచి మొదటి నాలుగు రోజుల పాటు అదనంగా రూ.95 పెంచుకునే అవకాశం కల్పించారు. అనంతరం మరో ఆరు రోజుల పాటు రూ.45 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో నైజాం మార్కెట్‌లో మొదటి వారంతో పాటు రెండో వారంలోనూ పెరిగిన టికెట్ ధరలు కొనసాగనున్నాయి.మొత్తంగా చూస్తే ‘ది ప్యారడైజ్’కు నైజాం మార్కెట్‌లో ప్రీమియర్స్‌తో పాటు టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతులు లభించాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమా కావడంతో ఓపెనింగ్ డే వసూళ్లపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రీమియర్స్ నుంచే సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? నాని కెరీర్‌లో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రానుంది.మరింత చదవండి

Source link