ప్రభన్యూస్

కత్రినా కైఫ్ బరువుపై ట్రోలింగ్.. ట్రోలర్స్‌కు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆమె బరువు పెరగడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు

News18
News18

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆమె బరువు పెరగడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘బిగ్ బాస్ 20’లోని ఓ ఎపిసోడ్‌లో ఈ విషయంపై మాట్లాడిన సల్మాన్.. మహిళల శరీరాకృతిపై కామెంట్స్ చేయడం, వారిని కించపరిచేలా ట్రోల్ చేయడం సరికాదని అన్నారు.

గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజమేనని సల్మాన్ పేర్కొన్నారు. కత్రినా ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడపాలని కోరుకుంటోందని, తిరిగి షూటింగ్స్‌లోకి వెళ్లే సమయానికి ఆమె తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. అందువల్ల ఆమెపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని, అయితే కొందరు మాత్రం ఇతరులను కించపరుస్తూ డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని సల్మాన్ విమర్శించారు. తమ నిజమైన గుర్తింపును బయటపెట్టకుండా.. ఇతరుల వయసు, బరువు, అందం గురించి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. ఎదుటివారి వైఫల్యాలను చూసి ఆనందించే వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు.

తనను కూడా వయసు పెరిగిపోయిందంటూ ట్రోల్ చేస్తుంటారని సల్మాన్ చెప్పారు. తనకు 60 ఏళ్లు వచ్చాయని, ఇకపై ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో కనిపించిన యువకుడిలా కనిపించడం సాధ్యం కాదని అన్నారు. వయసు పెరగడం ప్రతి ఒక్కరి జీవితంలో సహజమైన ప్రక్రియ అని, దానిని తప్పుగా చూపిస్తూ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ‘బిగ్ బాస్ 20’కు సంబంధించిన మరో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ వేదికపై మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఛాతీ పట్టుకుని కిందపడిపోయినట్లు కనిపించారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే అది నిజమైన ఘటన కాదని, ఒక కంటెస్టెంట్‌కు గుణపాఠం చెప్పేందుకు తాను చేసిన ప్రాంక్ మాత్రమేనని సల్మాన్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ తనకు అనారోగ్య సమస్య ఉందని, ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని మిగతా కంటెస్టెంట్లకు చెప్పినట్లు సల్మాన్ తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అబద్ధంగా చెప్పడం వల్ల ఇతరులు ఎంతగా ఆందోళన చెందుతారో ఆ కంటెస్టెంట్‌కు అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే తాను ఆ ప్రాంక్ చేసినట్లు వివరించారు. దీంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ క్లారిటీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 10:11 pm Digital Edition : Prabhanews
కత్రినా కైఫ్ బరువుపై ట్రోలింగ్.. ట్రోలర్స్‌కు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 20, 2026 10:02 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆమె బరువు పెరగడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారుNews18బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆమె బరువు పెరగడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘బిగ్ బాస్ 20’లోని ఓ ఎపిసోడ్‌లో ఈ విషయంపై మాట్లాడిన సల్మాన్.. మహిళల శరీరాకృతిపై కామెంట్స్ చేయడం, వారిని కించపరిచేలా ట్రోల్ చేయడం సరికాదని అన్నారు.గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజమేనని సల్మాన్ పేర్కొన్నారు. కత్రినా ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడపాలని కోరుకుంటోందని, తిరిగి షూటింగ్స్‌లోకి వెళ్లే సమయానికి ఆమె తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. అందువల్ల ఆమెపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని, అయితే కొందరు మాత్రం ఇతరులను కించపరుస్తూ డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని సల్మాన్ విమర్శించారు. తమ నిజమైన గుర్తింపును బయటపెట్టకుండా.. ఇతరుల వయసు, బరువు, అందం గురించి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. ఎదుటివారి వైఫల్యాలను చూసి ఆనందించే వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు.తనను కూడా వయసు పెరిగిపోయిందంటూ ట్రోల్ చేస్తుంటారని సల్మాన్ చెప్పారు. తనకు 60 ఏళ్లు వచ్చాయని, ఇకపై ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో కనిపించిన యువకుడిలా కనిపించడం సాధ్యం కాదని అన్నారు. వయసు పెరగడం ప్రతి ఒక్కరి జీవితంలో సహజమైన ప్రక్రియ అని, దానిని తప్పుగా చూపిస్తూ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ‘బిగ్ బాస్ 20’కు సంబంధించిన మరో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ వేదికపై మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఛాతీ పట్టుకుని కిందపడిపోయినట్లు కనిపించారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే అది నిజమైన ఘటన కాదని, ఒక కంటెస్టెంట్‌కు గుణపాఠం చెప్పేందుకు తాను చేసిన ప్రాంక్ మాత్రమేనని సల్మాన్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ తనకు అనారోగ్య సమస్య ఉందని, ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని మిగతా కంటెస్టెంట్లకు చెప్పినట్లు సల్మాన్ తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అబద్ధంగా చెప్పడం వల్ల ఇతరులు ఎంతగా ఆందోళన చెందుతారో ఆ కంటెస్టెంట్‌కు అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే తాను ఆ ప్రాంక్ చేసినట్లు వివరించారు. దీంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ క్లారిటీ ఇచ్చారు.మరింత చదవండి

Source link