ప్రభన్యూస్

ఆర్టీఐ దరఖాస్తుపై స్పందించిన ఎమ్మెల్యే కందికుంటకు ఆంజనేయులు ధన్యవాదాలు

కదిరి, ప్రభ న్యూస్, సెప్టెంబర్ 20 :

సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రజలకు ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉందని, ఆ హక్కు సమర్థవంతంగా అమలయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. ఆంజనేయులు పేర్కొన్నారు.తాను దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సంబంధించి ఎదురైన సమస్యను కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆంజనేయులు తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, విషయాన్ని పరిశీలించేందుకు ముందుకు రావడం స్వాగతించదగిన పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజా నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలు తదితర అంశాలకు సంబంధించి చట్టబద్ధంగా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి పౌరుడికి లభిస్తుందని ఆంజనేయులు తెలిపారు. ఆర్టీఐని కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఉపయోగించాల్సిన ముఖ్యమైన చట్టపరమైన సాధనంగా ఆయన అభివర్ణించారు.ఆర్టీఐ దరఖాస్తులకు చట్టంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం సమాచారం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమాచారం అందించడంలో ఏవైనా పరిపాలనా లేదా చట్టపరమైన సమస్యలు ఎదురైతే, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు.అదేవిధంగా, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే పౌరులపై వ్యక్తిగత విమర్శలు, అనవసర ఒత్తిళ్లకు తావులేకుండా, వారు చట్టబద్ధంగా కోరుతున్న సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించేలా వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంజనేయులు పేర్కొన్నారు.“ప్రజలు అడిగే ప్రశ్నలకు చట్టబద్ధమైన సమాధానాలు అందాలి. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినప్పుడే ప్రజల్లో పరిపాలనపై విశ్వాసం మరింత బలపడుతుంది. తాను దృష్టికి తీసుకువెళ్లిన ఆర్టీఐ అంశంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆంజనేయులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 1:17 pm Digital Edition : Prabhanews
<b>ఆర్టీఐ దరఖాస్తుపై స్పందించిన ఎమ్మెల్యే కందికుంటకు ఆంజనేయులు ధన్యవాదాలు</b>