ఆయుర్వేదంలో తులసిని ‘ఔషధాల రాణి’గా పరిగణిస్తారు. భారతీయ సంప్రదాయంలో తులసికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఆరోగ్య పరంగా తులసి ఆకులను ఎన్నో ఏళ్లుగా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. తాజా తులసి ఆకుల్లో అధిక శాతం నీటితో పాటు ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలు ఉంటాయని చెబుతారు.

