ఈ కథకు కేంద్రబిందువు నీమ్ కరోలి బాబా. ఆయన అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. హనుమంతుడిపై అపారమైన భక్తి, సేవ, ప్రేమ, కరుణకు ప్రాధాన్యత ఇచ్చిన ఆధ్యాత్మిక గురువుగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనతో అనుసంధానమైన కైంచీ ధామ్ కూడా దేశవ్యాప్తంగా భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలంగా మారింది. ఆయన బోధనల్లో పెద్ద పెద్ద సిద్ధాంతాల కంటే ప్రేమ, సేవ, భక్తి, ఇతరులకు సహాయం చేయడం వంటి సింపుల్ విషయాలే ప్రధానంగా కనిపిస్తాయి.

