ప్రభన్యూస్

Passport Fee Hike: పాస్‌పోర్ట్ ఫీజులు మారాయి.. తత్కాల్‌కు ఎంత చెల్లించాలి? పిల్లలకు ఎంతంటే? | బిజినెస్


Last Updated:

Passport Fee Hike: విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి కీలక సమాచారం. 2026 జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన ఫీజుల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. కొత్త పాస్‌పోర్ట్, తత్కాల్ సేవలు, మైనర్ల పాస్‌పోర్ట్ చెల్లుబాటు, పిల్లలు, సీనియర్ సిటిజన్లకు లభించే రాయితీల విషయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే ముందు ఈ రూల్స్, ఫీజులను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

News18
News18

Passport Rules 2026: విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కీలక సమాచారం. పాస్‌పోర్ట్ దరఖాస్తులకు సంబంధించిన ఫీజుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మైనర్ల పాస్‌పోర్ట్ చెల్లుబాటు, కొత్త పాస్‌పోర్ట్‌ల ఫీజులు, తత్కాల్ సేవల ఛార్జీలు, చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లకు లభించే రాయితీల విషయంలో కొత్త వివరాలు తెలుసుకోవాలి. Passport Seva అధికారిక పోర్టల్ కూడా కొత్త ఫీజులు 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు ఎంత?

18 ఏళ్లలోపు మైనర్లకు జారీ చేసే పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటుకు ప్రత్యేక నిబంధన ఉంది. మైనర్ పాస్‌పోర్ట్ సాధారణంగా ఐదేళ్లు లేదా దరఖాస్తుదారుడికి 18 ఏళ్లు వచ్చే వరకు.. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అంతవరకు చెల్లుతుంది. అంటే చిన్న వయస్సులో పాస్‌పోర్ట్ తీసుకున్న పిల్లలకు ఐదేళ్లు పూర్తయ్యేలోపే 18 ఏళ్లు వస్తే.. పాస్‌పోర్ట్ చెల్లుబాటు 18 ఏళ్లు నిండినప్పుడు ముగుస్తుంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో వారి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, విద్య, కుటుంబ పర్యటనలు వంటి అవసరాల కోసం ముందుగానే పాస్‌పోర్ట్ తీసుకుంటే.. దాని గడువు ఎప్పుడు ముగుస్తుందో కూడా చెక్ చేసుకోవడం అవసరం.

పెద్దలకు కొత్త పాస్‌పోర్ట్ ఫీజు ఎంత?

18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సాధారణ సేవ కింద 36 పేజీల కొత్త లేదా రీ-ఇష్యూ పాస్‌పోర్ట్‌కు రూ.2,500 ఫీజు ఉంటుంది. 60 పేజీల పాస్‌పోర్ట్ కావాలంటే రూ.3,500 చెల్లించాలి. అదే తత్కాల్ సేవను ఎంచుకుంటే ఫీజు మరింత పెరుగుతుంది. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాలి. తత్కాల్ ఫీజు సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును కలుపుకుని ఉండే విధంగా నిర్ణయిస్తారు.

మైనర్లకు ఎంత ఫీజు?

18 ఏళ్లలోపు పిల్లలకు సాధారణ సేవ కింద 36 పేజీల కొత్త లేదా రీ-ఇష్యూ పాస్‌పోర్ట్‌కు రూ.1,750 ఫీజు ఉంటుంది. అత్యవసరంగా తత్కాల్ సేవను ఎంచుకుంటే రూ.4,250 చెల్లించాల్సి ఉంటుంది. అంటే పిల్లల కోసం పాస్‌పోర్ట్ తీసుకునే తల్లిదండ్రులు సాధారణ సేవ, తత్కాల్ సేవల్లో ఏది అవసరమో ముందుగానే నిర్ణయించుకోవాలి. అత్యవసర ప్రయాణం లేకపోతే సాధారణ సేవలో దరఖాస్తు చేయడం ద్వారా తక్కువ ఫీజుతో ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

పాస్‌పోర్ట్ పోయినా, పాడైనా ఎంత?

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా దాని స్థానంలో కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ప్రత్యేక ఫీజు ఉంటుంది. 36 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌కు పెద్దలకు సాధారణ ఫీజు రూ.5,000, తత్కాల్ సేవలో రూ.7,500గా ఉంటుంది. మైనర్లకు ఇదే కేటగిరీలో 36 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్ కోసం సాధారణ సేవలో రూ.4,250, తత్కాల్‌లో రూ.6,750 చెల్లించాలి. అందువల్ల పాస్‌పోర్ట్‌ను భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి: Gold News: బంగారంపై డ్రాగన్ కంట్రీ కన్ను.. కుప్పలు కుప్పలుగా దాచిపెడుతోంది? భారీ స్కెచ్ వేస్తోందా?

కొత్త నిబంధనల్లో ముఖ్యమైన అంశాల్లో ఒకటి 8 ఏళ్ల వయస్సు వరకు ఉన్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు 10 శాతం రాయితీ. అయితే ఈ డిస్కౌంట్ అన్ని రకాల పాస్‌పోర్ట్ సేవలకు వర్తించదు. కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. రీ-ఇష్యూ దరఖాస్తులకు ఇది వర్తించదు. కాబట్టి చిన్న పిల్లల కోసం మొదటిసారి పాస్‌పోర్ట్ తీసుకునే తల్లిదండ్రులు, 60 ఏళ్లు పైబడిన వారు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ రాయితీని పరిగణనలోకి తీసుకోవచ్చు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మైనర్లకు మరో ముఖ్యమైన ఎంపిక ఉంది. ఈ వయస్సులో ఉన్న దరఖాస్తుదారులు నిబంధనల ప్రకారం పెద్దల కేటగిరీలో 10 సంవత్సరాల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే మైనర్ కేటగిరీలో దరఖాస్తు చేస్తే పాస్‌పోర్ట్ ఐదేళ్లు లేదా 18 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే చెల్లుతుంది. Passport Seva FAQ కూడా 15–18 ఏళ్ల మైనర్లకు 10 ఏళ్ల చెల్లుబాటు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటోంది. అందువల్ల ఈ వయస్సు పిల్లల తల్లిదండ్రులు దరఖాస్తు చేసే ముందు రెండు ఎంపికలను పరిశీలించడం మంచిది. ఒకవైపు మైనర్ కేటగిరీలో తక్కువ ఫీజు ఉండొచ్చు. మరోవైపు 10 ఏళ్ల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ తీసుకుంటే తరచుగా రీ-ఇష్యూ అవసరం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది.

పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఇతర సేవలకు కూడా ప్రత్యేక ఫీజులు ఉన్నాయి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), సరెండర్ సర్టిఫికేట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్ వంటి పాస్‌పోర్ట్ ఆధారిత సేవలను ఉపయోగించే వారు తాజా ఛార్జీలను ముందుగా తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక Passport Seva పోర్టల్‌లో ప్రస్తుత ఫీజు, అవసరమైన పత్రాలు, అపాయింట్‌మెంట్ వివరాలను చెక్ చేయడం మంచిది. అధికారిక పోర్టల్‌లోనే ఫీజులు 2026 జూలై 1 నుంచి సవరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 11:54 am Digital Edition : Prabhanews
Passport Fee Hike: పాస్‌పోర్ట్ ఫీజులు మారాయి.. తత్కాల్‌కు ఎంత చెల్లించాలి? పిల్లలకు ఎంతంటే? | బిజినెస్

Last Updated:Sep 18, 2026 11:54 AM ISTPassport Fee Hike: విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి కీలక సమాచారం. 2026 జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన ఫీజుల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. కొత్త పాస్‌పోర్ట్, తత్కాల్ సేవలు, మైనర్ల పాస్‌పోర్ట్ చెల్లుబాటు, పిల్లలు, సీనియర్ సిటిజన్లకు లభించే రాయితీల విషయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే ముందు ఈ రూల్స్, ఫీజులను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
News18Passport Rules 2026: విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కీలక సమాచారం. పాస్‌పోర్ట్ దరఖాస్తులకు సంబంధించిన ఫీజుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మైనర్ల పాస్‌పోర్ట్ చెల్లుబాటు, కొత్త పాస్‌పోర్ట్‌ల ఫీజులు, తత్కాల్ సేవల ఛార్జీలు, చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లకు లభించే రాయితీల విషయంలో కొత్త వివరాలు తెలుసుకోవాలి. Passport Seva అధికారిక పోర్టల్ కూడా కొత్త ఫీజులు 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు ఎంత?18 ఏళ్లలోపు మైనర్లకు జారీ చేసే పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటుకు ప్రత్యేక నిబంధన ఉంది. మైనర్ పాస్‌పోర్ట్ సాధారణంగా ఐదేళ్లు లేదా దరఖాస్తుదారుడికి 18 ఏళ్లు వచ్చే వరకు.. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అంతవరకు చెల్లుతుంది. అంటే చిన్న వయస్సులో పాస్‌పోర్ట్ తీసుకున్న పిల్లలకు ఐదేళ్లు పూర్తయ్యేలోపే 18 ఏళ్లు వస్తే.. పాస్‌పోర్ట్ చెల్లుబాటు 18 ఏళ్లు నిండినప్పుడు ముగుస్తుంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో వారి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, విద్య, కుటుంబ పర్యటనలు వంటి అవసరాల కోసం ముందుగానే పాస్‌పోర్ట్ తీసుకుంటే.. దాని గడువు ఎప్పుడు ముగుస్తుందో కూడా చెక్ చేసుకోవడం అవసరం.పెద్దలకు కొత్త పాస్‌పోర్ట్ ఫీజు ఎంత?18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సాధారణ సేవ కింద 36 పేజీల కొత్త లేదా రీ-ఇష్యూ పాస్‌పోర్ట్‌కు రూ.2,500 ఫీజు ఉంటుంది. 60 పేజీల పాస్‌పోర్ట్ కావాలంటే రూ.3,500 చెల్లించాలి. అదే తత్కాల్ సేవను ఎంచుకుంటే ఫీజు మరింత పెరుగుతుంది. 36 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాలి. తత్కాల్ ఫీజు సాధారణ పాస్‌పోర్ట్ ఫీజును కలుపుకుని ఉండే విధంగా నిర్ణయిస్తారు.మైనర్లకు ఎంత ఫీజు?18 ఏళ్లలోపు పిల్లలకు సాధారణ సేవ కింద 36 పేజీల కొత్త లేదా రీ-ఇష్యూ పాస్‌పోర్ట్‌కు రూ.1,750 ఫీజు ఉంటుంది. అత్యవసరంగా తత్కాల్ సేవను ఎంచుకుంటే రూ.4,250 చెల్లించాల్సి ఉంటుంది. అంటే పిల్లల కోసం పాస్‌పోర్ట్ తీసుకునే తల్లిదండ్రులు సాధారణ సేవ, తత్కాల్ సేవల్లో ఏది అవసరమో ముందుగానే నిర్ణయించుకోవాలి. అత్యవసర ప్రయాణం లేకపోతే సాధారణ సేవలో దరఖాస్తు చేయడం ద్వారా తక్కువ ఫీజుతో ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.పాస్‌పోర్ట్ పోయినా, పాడైనా ఎంత?పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా దాని స్థానంలో కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ప్రత్యేక ఫీజు ఉంటుంది. 36 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌కు పెద్దలకు సాధారణ ఫీజు రూ.5,000, తత్కాల్ సేవలో రూ.7,500గా ఉంటుంది. మైనర్లకు ఇదే కేటగిరీలో 36 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్ కోసం సాధారణ సేవలో రూ.4,250, తత్కాల్‌లో రూ.6,750 చెల్లించాలి. అందువల్ల పాస్‌పోర్ట్‌ను భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.ఇవి కూడా చదవండి: Gold News: బంగారంపై డ్రాగన్ కంట్రీ కన్ను.. కుప్పలు కుప్పలుగా దాచిపెడుతోంది? భారీ స్కెచ్ వేస్తోందా?కొత్త నిబంధనల్లో ముఖ్యమైన అంశాల్లో ఒకటి 8 ఏళ్ల వయస్సు వరకు ఉన్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు 10 శాతం రాయితీ. అయితే ఈ డిస్కౌంట్ అన్ని రకాల పాస్‌పోర్ట్ సేవలకు వర్తించదు. కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. రీ-ఇష్యూ దరఖాస్తులకు ఇది వర్తించదు. కాబట్టి చిన్న పిల్లల కోసం మొదటిసారి పాస్‌పోర్ట్ తీసుకునే తల్లిదండ్రులు, 60 ఏళ్లు పైబడిన వారు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ రాయితీని పరిగణనలోకి తీసుకోవచ్చు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మైనర్లకు మరో ముఖ్యమైన ఎంపిక ఉంది. ఈ వయస్సులో ఉన్న దరఖాస్తుదారులు నిబంధనల ప్రకారం పెద్దల కేటగిరీలో 10 సంవత్సరాల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే మైనర్ కేటగిరీలో దరఖాస్తు చేస్తే పాస్‌పోర్ట్ ఐదేళ్లు లేదా 18 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే చెల్లుతుంది. Passport Seva FAQ కూడా 15–18 ఏళ్ల మైనర్లకు 10 ఏళ్ల చెల్లుబాటు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటోంది. అందువల్ల ఈ వయస్సు పిల్లల తల్లిదండ్రులు దరఖాస్తు చేసే ముందు రెండు ఎంపికలను పరిశీలించడం మంచిది. ఒకవైపు మైనర్ కేటగిరీలో తక్కువ ఫీజు ఉండొచ్చు. మరోవైపు 10 ఏళ్ల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ తీసుకుంటే తరచుగా రీ-ఇష్యూ అవసరం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది.పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఇతర సేవలకు కూడా ప్రత్యేక ఫీజులు ఉన్నాయి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), సరెండర్ సర్టిఫికేట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్ వంటి పాస్‌పోర్ట్ ఆధారిత సేవలను ఉపయోగించే వారు తాజా ఛార్జీలను ముందుగా తెలుసుకోవాలి. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక Passport Seva పోర్టల్‌లో ప్రస్తుత ఫీజు, అవసరమైన పత్రాలు, అపాయింట్‌మెంట్ వివరాలను చెక్ చేయడం మంచిది. అధికారిక పోర్టల్‌లోనే ఫీజులు 2026 జూలై 1 నుంచి సవరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు.మరింత చదవండి

Source link