ప్రభన్యూస్

Prabhas Fauzi Movie: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ ట్విస్ట్.. రిలీజ్ డేట్‌పై ఎందుకీ సస్పెన్స్? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫౌజీ’పై కూడా మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది.

News18
News18

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫౌజీ’పై కూడా మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ పెరిగింది.

‘సీతారామం’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి, ప్రభాస్‌ను సరికొత్త కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా షూటింగ్, నిర్మాణ పనులపై మొదటి నుంచే మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

అయితే తాజాగా ‘ఫౌజీ’ విడుదలకు సంబంధించి ఓ కీలకమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా విడుదల దాదాపు వాయిదా పడినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం సాధ్యమయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో మేకర్స్ ప్రస్తుతం షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.

షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు చిత్రీకరించిన ఫుటేజీ మొత్తాన్ని మేకర్స్ ఒకసారి పూర్తిగా పరిశీలించనున్నారట. షూట్ చేసిన సన్నివేశాలు, వాటి కంటిన్యూటీ, కథకు అనుగుణంగా అవసరమైన మార్పులు, ప్యాచ్ వర్క్ తదితర అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ఇక ‘ఫౌజీ’లో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలతో పాటు మరో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించాల్సి ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెండు యాక్షన్ బ్లాక్స్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సుమారు 30 నుంచి 40 రోజుల సమయం అవసరమవుతుందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా కావడంతో యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ కారణంగానే ఈసారి సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ పూర్తికాకముందే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడం కంటే, మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై స్పష్టత వచ్చిన తర్వాతే విడుదల తేదీని లాక్ చేయాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం ‘ఫౌజీ’ టీమ్ తీసుకున్న ఫుటేజీని పరిశీలించే పనిలో ఉండగా, మిగిలిన షూటింగ్‌కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు పూర్తి చేసిన తర్వాతే సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న వాయిదా వార్తలను ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఆధారంగా వచ్చిన అప్‌డేట్‌గానే చూడాలి. షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే విషయంపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 1:25 pm Digital Edition : Prabhanews
Prabhas Fauzi Movie: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ ట్విస్ట్.. రిలీజ్ డేట్‌పై ఎందుకీ సస్పెన్స్? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 17, 2026 1:08 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫౌజీ’పై కూడా మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది.News18యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫౌజీ’పై కూడా మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ పెరిగింది.‘సీతారామం’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి, ప్రభాస్‌ను సరికొత్త కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా షూటింగ్, నిర్మాణ పనులపై మొదటి నుంచే మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు.అయితే తాజాగా ‘ఫౌజీ’ విడుదలకు సంబంధించి ఓ కీలకమైన అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా విడుదల దాదాపు వాయిదా పడినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం సాధ్యమయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో మేకర్స్ ప్రస్తుతం షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకు చిత్రీకరించిన ఫుటేజీ మొత్తాన్ని మేకర్స్ ఒకసారి పూర్తిగా పరిశీలించనున్నారట. షూట్ చేసిన సన్నివేశాలు, వాటి కంటిన్యూటీ, కథకు అనుగుణంగా అవసరమైన మార్పులు, ప్యాచ్ వర్క్ తదితర అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.ఇక ‘ఫౌజీ’లో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలతో పాటు మరో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించాల్సి ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెండు యాక్షన్ బ్లాక్స్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సుమారు 30 నుంచి 40 రోజుల సమయం అవసరమవుతుందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా కావడంతో యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ కారణంగానే ఈసారి సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ పూర్తికాకముందే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడం కంటే, మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై స్పష్టత వచ్చిన తర్వాతే విడుదల తేదీని లాక్ చేయాలని భావిస్తున్నారట.ప్రస్తుతం ‘ఫౌజీ’ టీమ్ తీసుకున్న ఫుటేజీని పరిశీలించే పనిలో ఉండగా, మిగిలిన షూటింగ్‌కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు పూర్తి చేసిన తర్వాతే సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్‌పై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న వాయిదా వార్తలను ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఆధారంగా వచ్చిన అప్‌డేట్‌గానే చూడాలి. షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే విషయంపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link