ప్రభన్యూస్

Storage Tips: ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో ఈ వస్తువులు పెట్టకూడదట.. లోపల పెట్టడమే సేఫ్.. ఎందుకో తెలుసా..! | లైఫ్ స్టైల్


Last Updated:

ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పాలు, గుడ్లు, నిమ్మకాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చి చట్నీ, మాంసం వంటివి పెట్టకూడదు. ఊరగాయలు, కెచప్ వంటివి డోర్‌లో ఉంచవచ్చు.

News18
News18

ఇంట్లో ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన ప్రతి వస్తువూ ఒకే విధంగా సురక్షితంగా ఉంటుందని అనుకోవడం సరికాదని విజయనగరానికి పోషకాహార నిపుణుడు సురేష్ తెలిపారు. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్ షెల్ఫ్ విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని ఆయన వివరించారు. డోర్‌ను పదేపదే తెరవడం, మూసివేయడం వల్ల అక్కడి ఉష్ణోగ్రతలో మార్పులు జరుగుతుంటాయి. దీంతో కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉన్నప్పటికీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. పోషకాహార నిపుణుడు సురేష్ పేర్కొన్నారు.

పాలు, పాలతో తయారయ్యే పదార్థాలను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పెట్టడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పనీర్, చీజ్, పెరుగు, యోగర్ట్, లస్సీ, మజ్జిగ, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వంటి వాటిని ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లో ఉంచడం మంచిది. డోర్ తరచూ తెరుచుకోవడం వల్ల ఉష్ణోగ్రత మారుతుండటంతో పాల ఉత్పత్తులు త్వరగా నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. గుడ్లను కూడా డోర్‌లో కాకుండా వాటి ప్యాకేజింగ్‌లోనే ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లో భద్రపరచడం మంచిదని సూచిస్తున్నారు.

కట్ చేసిన నిమ్మకాయలను కూడా డోర్ షెల్ఫ్‌లో పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా కోసిన నిమ్మకాయ త్వరగా ఎండిపోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బూజు పట్టడం, పాడవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు కూడా ఇదే జాగ్రత్త అవసరం. ప్యాకెట్ తెరిచి ఉంటే లేదా సరిగ్గా మూసి ఉంచకపోతే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గాలి చొరబడకుండా మూసి ఫ్రిజ్ లోపలి భాగంలో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.

ఇంట్లో తయారు చేసిన పచ్చి చట్నీ, మిగిలిపోయిన వంటకాలను కూడా ఫ్రిజ్ డోర్‌లో పెట్టకుండా లోపలి షెల్ఫ్‌లో భద్రపరచడం మంచిదని సూచిస్తున్నారు. చట్నీలో తేమ ఎక్కువగా ఉండటంతో అది త్వరగా నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఉష్ణోగ్రత మార్పులు ఎక్కువగా ఉండే డోర్ షెల్ఫ్‌లో ఉంచితే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే పచ్చి మాంసం, చేపలను కూడా డోర్‌లో నిల్వ చేయకూడదు. వీటిని సరిగ్గా మూసిన కంటైనర్‌లో లేదా ప్యాకింగ్‌లో ఫ్రిజ్‌లోని తగిన చల్లని భాగంలో ఉంచాలి.

అయితే ఫ్రిజ్ డోర్ షెల్ఫ్ పూర్తిగా పనికిరాదని కాదు. ఊరగాయలు, కెచప్, మస్టర్డ్, జామ్, కమర్షియల్ సాస్‌లు వంటి కొంతకాలం నిల్వ ఉండే పదార్థాలను అక్కడ ఉంచుకోవచ్చు. వెన్న, నీరు, శీతల పానీయాలు వంటి వాటిని కూడా డోర్ షెల్ఫ్‌లో పెట్టుకోవచ్చు. ఏదేమైనా ఆహారం ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది అనేది దాని స్వభావం, ప్యాకేజింగ్, ఫ్రిజ్ ఉష్ణోగ్రత, నిల్వ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్ డోర్‌లో అన్నింటినీ ఒకేలా పెట్టకుండా.. త్వరగా పాడయ్యే పదార్థాలను లోపలి చల్లని షెల్ఫ్‌లలో భద్రపరచడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 8:36 pm Digital Edition : Prabhanews
Storage Tips: ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో ఈ వస్తువులు పెట్టకూడదట.. లోపల పెట్టడమే సేఫ్.. ఎందుకో తెలుసా..! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 16, 2026 8:30 PM ISTఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పాలు, గుడ్లు, నిమ్మకాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చి చట్నీ, మాంసం వంటివి పెట్టకూడదు. ఊరగాయలు, కెచప్ వంటివి డోర్‌లో ఉంచవచ్చు.News18ఇంట్లో ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. అయితే ఫ్రిజ్‌లో పెట్టిన ప్రతి వస్తువూ ఒకే విధంగా సురక్షితంగా ఉంటుందని అనుకోవడం సరికాదని విజయనగరానికి పోషకాహార నిపుణుడు సురేష్ తెలిపారు. ముఖ్యంగా ఫ్రిజ్ డోర్ షెల్ఫ్ విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని ఆయన వివరించారు. డోర్‌ను పదేపదే తెరవడం, మూసివేయడం వల్ల అక్కడి ఉష్ణోగ్రతలో మార్పులు జరుగుతుంటాయి. దీంతో కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉన్నప్పటికీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. పోషకాహార నిపుణుడు సురేష్ పేర్కొన్నారు.పాలు, పాలతో తయారయ్యే పదార్థాలను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పెట్టడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పనీర్, చీజ్, పెరుగు, యోగర్ట్, లస్సీ, మజ్జిగ, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ వంటి వాటిని ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లో ఉంచడం మంచిది. డోర్ తరచూ తెరుచుకోవడం వల్ల ఉష్ణోగ్రత మారుతుండటంతో పాల ఉత్పత్తులు త్వరగా నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. గుడ్లను కూడా డోర్‌లో కాకుండా వాటి ప్యాకేజింగ్‌లోనే ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లో భద్రపరచడం మంచిదని సూచిస్తున్నారు.కట్ చేసిన నిమ్మకాయలను కూడా డోర్ షెల్ఫ్‌లో పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా కోసిన నిమ్మకాయ త్వరగా ఎండిపోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బూజు పట్టడం, పాడవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు కూడా ఇదే జాగ్రత్త అవసరం. ప్యాకెట్ తెరిచి ఉంటే లేదా సరిగ్గా మూసి ఉంచకపోతే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గాలి చొరబడకుండా మూసి ఫ్రిజ్ లోపలి భాగంలో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.ఇంట్లో తయారు చేసిన పచ్చి చట్నీ, మిగిలిపోయిన వంటకాలను కూడా ఫ్రిజ్ డోర్‌లో పెట్టకుండా లోపలి షెల్ఫ్‌లో భద్రపరచడం మంచిదని సూచిస్తున్నారు. చట్నీలో తేమ ఎక్కువగా ఉండటంతో అది త్వరగా నాణ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఉష్ణోగ్రత మార్పులు ఎక్కువగా ఉండే డోర్ షెల్ఫ్‌లో ఉంచితే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే పచ్చి మాంసం, చేపలను కూడా డోర్‌లో నిల్వ చేయకూడదు. వీటిని సరిగ్గా మూసిన కంటైనర్‌లో లేదా ప్యాకింగ్‌లో ఫ్రిజ్‌లోని తగిన చల్లని భాగంలో ఉంచాలి.అయితే ఫ్రిజ్ డోర్ షెల్ఫ్ పూర్తిగా పనికిరాదని కాదు. ఊరగాయలు, కెచప్, మస్టర్డ్, జామ్, కమర్షియల్ సాస్‌లు వంటి కొంతకాలం నిల్వ ఉండే పదార్థాలను అక్కడ ఉంచుకోవచ్చు. వెన్న, నీరు, శీతల పానీయాలు వంటి వాటిని కూడా డోర్ షెల్ఫ్‌లో పెట్టుకోవచ్చు. ఏదేమైనా ఆహారం ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది అనేది దాని స్వభావం, ప్యాకేజింగ్, ఫ్రిజ్ ఉష్ణోగ్రత, నిల్వ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్ డోర్‌లో అన్నింటినీ ఒకేలా పెట్టకుండా.. త్వరగా పాడయ్యే పదార్థాలను లోపలి చల్లని షెల్ఫ్‌లలో భద్రపరచడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.మరింత చదవండి

Source link