Last Updated:
యూపీఐ చెల్లింపులు చేసే వారికి కీలక మార్పు రాబోతోంది. రూ.2,000 దాటిన లావాదేవీలపై కొత్తగా ఛార్జీ విధించనున్నారు. అసలు ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుసా?
యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వారికి కీలక మార్పు రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మంగళవారం యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించనున్నారు. NPCI ఖరారు చేసిన ఈ MDR విధానం, లావాదేవీల పరిమితులకు సంబంధించిన కొత్త నిర్మాణం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే, అధిక మొత్తాల్లో జరిగే చెల్లింపులకు ఛార్జీపై గరిష్ఠ పరిమితిని కూడా నిర్ణయించారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు ఒక్కో చెల్లింపుపై MDR గరిష్ఠంగా రూ.300 మాత్రమే ఉండేలా పరిమితి విధించారు. అంటే లావాదేవీ మొత్తం ఎంత పెరిగినా, రూ.75,000 పైబడిన చెల్లింపుల విషయంలో ఒక్కో లావాదేవీకి వసూలు చేసే MDR రూ.300కు మించదు. ఈ కొత్త విధానం ప్రధానంగా వ్యాపారులకు సంబంధించిన యూపీఐ చెల్లింపులపై ప్రభావం చూపనుంది.
ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్డేట్లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

