Last Updated:
Gurugram Road Rage: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళా బైకర్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైక్ కొన్ని మీటర్ల పాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘rebelwheels_sia_’ పేరిట పేజీ నడుపుతున్న సియా అనే బైకర్.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలను తన ఖాతాలో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. “ఈ రోజు గురుగ్రామ్ రోడ్లపై ప్రయాణించడానికి నాకు భయమేసింది. అమాయకులను వాహనాలతో ఢీకొట్టి పారిపోవడానికి ఇలాంటి వాళ్లు ఏమాత్రం వెనుకాడడం లేదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

