Last Updated:
మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ సినిమా వారణాసి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi). ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడం.. మహేష్ బాబు తొలిసారిగా పాన్-వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేయగా, అప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

