3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే జీతాలు ఎలా మారతాయి?ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే, ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనాన్ని 3.83తో గుణించడం ద్వారా కొత్త మూల వేతనం నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం రూ.18,000 బేసిక్ పే పొందుతున్న ఉద్యోగి వేతనం సుమారు రూ.68,940కు, అంటే దాదాపు రూ.69,000కు చేరుకుంటుంది. అదేవిధంగా ప్రస్తుతం రూ.25,500 మూల వేతనం ఉన్న ఉద్యోగి బేసిక్ పే సుమారు రూ.97,665కు పెరిగే అవకాశం ఉంది. రూ.35,400 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి అది రూ.1,35,582కు చేరవచ్చు. రూ.44,900 వేతనం పొందుతున్న ఉద్యోగికి సుమారు రూ.1,71,967, అలాగే రూ.56,100 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి సుమారు రూ.2,14,863 వరకు మూల వేతనం పెరిగే అవకాశం ఉంటుందని సంఘం ఉదాహరణలతో వివరించింది.

