Washing Machine: బట్టలు ఉతికినా మరకలు పోవడం లేదా? వాషింగ్ మెషిన్ ఆన్ చేసే ముందు ఇలా చేయండి… |
బట్టలతో పాటు వాషింగ్ మెషిన్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. డ్రమ్, డిటర్జెంట్ ట్రే, రబ్బర్ సీల్, ఫిల్టర్లలో సబ్బు అవశేషాలు, దుమ్ము, నూలు తునకలు, తేమ పేరుకుపోవచ్చు. కొంతకాలానికి ఇవి ఫంగస్ ఏర్పడటానికి దారితీస్తాయి. ఆ తర్వాత ఉతికిన బట్టలకు కూడా దుర్వాసన అంటుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మెషిన్‌తో పాటు ఫిల్టర్లను కనీసం నెలకు ఒకసారి శుభ్రం చేయడం మంచిది. అలాగే ఖాళీ డ్రమ్‌తో ఒక వాష్ సైకిల్ నడపడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది….
