కానీ ఇన్సూరర్ మార్చే సమయంలో కవరేజ్‌ను భారీగా పెంచితే పరిస్థితి మారొచ్చు. ఉదాహరణకు రూ.10 లక్షల కవరేజ్‌ను రూ.25 లక్షలకు పెంచారనుకుందాం. మొత్తం రూ.25 లక్షలకు మొదటి రోజు నుంచే పాత పాలసీకి ఉన్నట్టే వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు వస్తాయని అనుకోవద్దు. పెంచిన అదనపు కవరేజ్‌కు వేరే వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు ఉండొచ్చు. ఇక్కడే చాలామంది ఇబ్బందుల్లో పడుతుంటారు. కొత్త ఇన్సూరర్ తక్కువ ప్రీమియం తీసుకుంటున్నాడా, ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ ఇస్తున్నాడా అనే విషయాలపైనే దృష్టి పెడతారు. కానీ వెయిటింగ్ పీరియడ్స్, రూమ్ రెంట్ పరిమితులు, కో-పేమెంట్, మినహాయింపులు, సబ్-లిమిట్స్ వంటి ముఖ్యమైన నిబంధనలను పూర్తిగా చూడరు. (ప్రతీకాత్మక చిత్రం)

