విదేశీ నేత దేశాన్ని అవమానిస్తుంటే నవ్వుతారా?: రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ఆగ్రహం! |


Last Updated:

హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత చేసిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు.

News18
News18

హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ ‘భారత్ సమ్మిట్ 2026’లో ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) వివాదాన్ని ప్రస్తావిస్తూ ఫిలిబెక్ ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ (ఓట్ల దొంగ, గద్దె దిగు) అంటూ నినదించగా, వేదికపై ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఈ ఘటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

“విదేశీయుడు మన దేశాన్ని అవమానిస్తుంటే నవ్వే వ్యక్తిని ఎక్కడైనా చూశారా? విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని అవమానించే భారతీయుడి గురించి నేను అడగడం లేదు” అంటూ రిజిజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో 2023 మార్చిలో లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటలీ నేత వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ భగ్గు

పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న జియాకోమో ఫిలిబెక్ సదస్సులో మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ సూత్రాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. రెండు వారాల క్రితం ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రతిపక్షాలు నిర్వహించిన మార్చ్‌ను గుర్తుచేస్తూ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నాయకుడి జోక్యాన్ని ప్రోత్సహించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీఆర్ఎస్ నేత కార్తీక్ ఇంద్రారెడ్డి పట్లోళ్ల తీవ్రంగా మండిపడ్డారు.

ఇది దేశద్రోహం కాదా?: రామచందర్ రావు

విదేశీ నాయకులను పిలిచి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయిస్తూ, వారి వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ గర్వంగా చప్పట్లు కొట్టడం దేశద్రోహం కిందకు రాదా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇకపై భారతీయ నాయకుడిలా ప్రవర్తించడం లేదని, తన విదేశీ యజమానుల కనుసన్నల్లో ఆడే కీలుబొమ్మలా మారారని తీవ్ర ఆరోపణలు చేశారు. భారత అంతర్గత రాజకీయాలపై మాట్లాడే హక్కు విదేశీ నేతకు ఎవరిచ్చారని బీఆర్ఎస్ ప్రతినిధి కార్తీక్ ఇంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 8:27 pm Digital Edition : Prabhanews
విదేశీ నేత దేశాన్ని అవమానిస్తుంటే నవ్వుతారా?: రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ఆగ్రహం! |

Last Updated:Nov 15, 2026 8:23 PM ISTహైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత చేసిన 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు.News18హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ 'భారత్ సమ్మిట్ 2026'లో ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) వివాదాన్ని ప్రస్తావిస్తూ ఫిలిబెక్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' (ఓట్ల దొంగ, గద్దె దిగు) అంటూ నినదించగా, వేదికపై ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఈ ఘటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు."విదేశీయుడు మన దేశాన్ని అవమానిస్తుంటే నవ్వే వ్యక్తిని ఎక్కడైనా చూశారా? విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని అవమానించే భారతీయుడి గురించి నేను అడగడం లేదు" అంటూ రిజిజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో 2023 మార్చిలో లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు.ఇటలీ నేత వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ భగ్గుపార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న జియాకోమో ఫిలిబెక్ సదస్సులో మాట్లాడుతూ, 'ఒక వ్యక్తి - ఒక ఓటు' సూత్రాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. రెండు వారాల క్రితం ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రతిపక్షాలు నిర్వహించిన మార్చ్‌ను గుర్తుచేస్తూ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నాయకుడి జోక్యాన్ని ప్రోత్సహించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీఆర్ఎస్ నేత కార్తీక్ ఇంద్రారెడ్డి పట్లోళ్ల తీవ్రంగా మండిపడ్డారు.ఇది దేశద్రోహం కాదా?: రామచందర్ రావువిదేశీ నాయకులను పిలిచి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయిస్తూ, వారి వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ గర్వంగా చప్పట్లు కొట్టడం దేశద్రోహం కిందకు రాదా అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇకపై భారతీయ నాయకుడిలా ప్రవర్తించడం లేదని, తన విదేశీ యజమానుల కనుసన్నల్లో ఆడే కీలుబొమ్మలా మారారని తీవ్ర ఆరోపణలు చేశారు. భారత అంతర్గత రాజకీయాలపై మాట్లాడే హక్కు విదేశీ నేతకు ఎవరిచ్చారని బీఆర్ఎస్ ప్రతినిధి కార్తీక్ ఇంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.మరింత చదవండి

Source link