Last Updated:
గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్‌జీ వాహనాల వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్లు డిజిటలైజ్ చేస్తారు.
గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు ప్రతిపాదనలు చేసింది. ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్‌జీ వాహనాలను ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా వాహనాల వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని ఎన్‌డీటీవీ ప్రాఫిట్ కథనం వెల్లడించింది. దీంతో వాహన యజమానులకు, ముఖ్యంగా కమర్షియల్ వాహనాలు నడిపేవారికి ఆర్థికంగా ప్రయోజనం కలగొచ్చు. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH) మోటార్ వెహికల్ రూల్స్‌లో కీలక మార్పులు చేయాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు సవరణల ముసాయిదాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో వాహనాలను ఎంతకాలం నడపొచ్చు, పర్మిట్లు ఎలా తీసుకోవాలి, ఆటోమొబైల్ తయారీ రంగానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు వంటి అంశాలను చేర్చింది.

