Last Updated:
సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? పెట్టుబడి లేక ఆగిపోయారా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Startup India, Stand-Up India పథకాలు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోవాల్సిందే.
దేశంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువతను ఉద్యోగాల కోసం వెతికేవారి నుంచి ఉద్యోగాలు సృష్టించేవారిగా మార్చడం, స్వయం ఉపాధిని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2016లో Startup India, Stand-Up India పథకాలను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

