Last Updated:
జియో మార్ట్ ఆగస్టు 12 నుంచి 16 వరకు సేల్ ప్రకటించింది. కిరాణా సరుకులు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌తో పాటు పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉన్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జియోమార్ట్ క్విక్ తన గ్రాండ్ ఇండిపెండెన్స్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఐదు రోజుల సేల్‌లో పలు ఉత్పత్తులు, ప్రముఖ బ్రాండ్లపై 80% వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 16 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. పండుగ షాపింగ్‌లో ఆదా చేసుకోవడంతో పాటు, జియోమార్ట్ క్విక్ ద్వారా వేగంగా డెలివరీ పొందే అవకాశం కూడా కస్టమర్లకు ఉంటుంది. జియోమార్ట్ క్విక్ అనేది జియోమార్ట్ అందిస్తున్న క్విక్ కామర్స్ సర్వీస్. ఇందులో కిరాణా సరుకులు, రోజువారీ అవసరాల వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వస్తువులు, పండుగకు అవసరమైన ప్రత్యేక ఉత్పత్తులు వంటి వాటిని కొనుగోలు చేయొచ్చు. ఆర్డర్ చేసిన వస్తువులను కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంటి వద్దకు డెలివరీ చేసే సదుపాయం ఉంది.

