Last Updated:
Jio 10 Years: భారత టెలికాం రంగంలో సంచలన మార్పులకు నాంది పలికిన జియో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 2016లో తక్కువ ధరలకు మొబైల్ డేటాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలో డిజిటల్ విప్లవానికి ఊతమిచ్చిన జియో.. ఇప్పుడు 52 కోట్లకు పైగా వినియోగదారులతో టెలికాం సేవలకే పరిమితం కాకుండా 5G, క్లౌడ్ కంప్యూటింగ్, AI, డివైస్ ఇంజనీరింగ్, డిజిటల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ వంటి రంగాల్లోకి విస్తరించింది. ఈ పదేళ్లలో జియో ప్రయాణం భారత్లో ఇంటర్నెట్ వినియోగం, డేటా ధరలు, కనెక్టివిటీ, డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకుందాం.
భారతదేశ టెలికాం రంగంలో ఒక సంచలనంగా ప్రారంభమైన జియో, పదేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని కేవలం ఒక సాధారణ మొబైల్ కనెక్షన్గా మాత్రమే మిగిలిపోలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ సంస్థ, నేడు జియో ప్లాట్ఫామ్స్ రూపంలో నెట్వర్క్ల నిర్వహణ, డివైస్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యున్నత సాంకేతిక రంగాలలోకి తన పరిధిని అనూహ్యంగా విస్తరించింది. సెప్టెంబర్ 2016లో జియో మార్కెట్లోకి అడుగుపెట్టినప్పుడు, అప్పటివరకు సామాన్యుడికి అందని ద్రాక్షలా ఉన్న మొబైల్ డేటాను అత్యంత తక్కువ ధరలకు అందజేసి, ఒక సగటు భారతీయుడు తన స్మార్ట్ఫోన్తో చేయగలిగే పనుల రూపురేఖలను పూర్తిగా మార్చేసింది.

