ప్రభన్యూస్

కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! | లైఫ్ స్టైల్


Last Updated:

ఉదయం నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి వస్తోందా? చేతులు పైకి ఎత్తడం, మోకాలిని పూర్తిగా చాపడం కష్టంగా మారిందా? చాలామంది ఈ సమస్యలను వయసు పెరగడం లేదా శారీరక శ్రమ వల్ల కలిగేవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇవే లక్షణాలు పదేపదే కనిపిస్తే వాటి వెనుక ఆర్థరైటిస్‌ ఉండే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

News18
News18

కీళ్ల సమస్యలు ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితోనే మొదలవ్వాలని లేదు. మొదట్లో స్వల్ప అసౌకర్యం, అప్పుడప్పుడు నొప్పి, కదలికల్లో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలామంది వీటిని వయసు పెరగడం లేదా శారీరక శ్రమ వల్ల వచ్చిన సమస్యలుగా భావించి పట్టించుకోరు. అయితే ఇవే లక్షణాలు పదేపదే ఎదురైతే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌ ప్రారంభ దశలో కనిపించే సంకేతాలను గుర్తించడం ద్వారా కీళ్ల కదలికలు, రోజువారీ జీవన నాణ్యతపై ప్రభావం పడకుండా తగిన సమయంలో వైద్య సలహా పొందవచ్చు.

ఆహారపు అలవాట్లతోనూ సంబంధం ఉందా?

భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (NIN) సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బాధితుల ఆహారపు అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యవంతులతో పోలిస్తే ఈ వ్యాధి ఉన్నవారి ఆహారంలో వైవిధ్యం తక్కువగా ఉండటంతో పాటు, సూక్ష్మపోషకాల అవసరాలు తగినంతగా తీరడం లేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే వారిలో వాపును ప్రోత్సహించే అవకాశం ఉన్న ఆహార విధానం ఎక్కువగా కనిపించింది.

ఈ అధ్యయనంలో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 615 మందిని పరిశీలించారు. వీరిలో 301 మంది కొత్తగా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నిర్ధారణ అయినవారు కాగా, 314 మంది ఆరోగ్యవంతులు. ఆహారం వల్ల శరీరంలో వాపు కలిగే అవకాశాన్ని అంచనా వేసే డైటరీ ఇన్‌ఫ్లమేటరీ ఇండెక్స్‌ (DII) మధ్యస్థ స్కోరు బాధితుల్లో 2.18గా నమోదైంది. ఆరోగ్యవంతుల్లో ఇది 0.37గా ఉంది. ఈ వివరాలను డెక్కన్‌ క్రానికల్‌ నివేదించింది.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనేది రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కీళ్ల లోపలి పొరపై దాడి చేయడం వల్ల వాపు, నొప్పి, వాపుతో కూడిన ఉబ్బరం, బిగుతుదనం కలిగించే దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక వ్యాధి. మణిపాల్‌ హాస్పిటల్‌ ద్వారక, న్యూఢిల్లీలోని మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ జాయింట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ వర్మ సూచనల ప్రకారం, కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తించడం ముఖ్యం.

ఉదయం కీళ్లు బిగుసుకుపోతున్నాయా?

నిద్రలేచిన వెంటనే కీళ్లు బిగుతుగా అనిపించడం, కదలడానికి ఇబ్బంది పడటం ముఖ్యమైన సంకేతం. ఈ సమస్య తగ్గడానికి 30 నిమిషాల నుంచి గంట వరకు పట్టవచ్చు. రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల కీళ్లలో మార్పులు, వాపు కారణంగా ఇలా జరగవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఈ లక్షణం కనిపిస్తే ఎముకలు, కీళ్ల వైద్యుడిని సంప్రదించాలి.

పనులు చేసేటప్పుడు నొప్పి

మెట్లు ఎక్కడం, వస్తువులను గట్టిగా పట్టుకోవడం, కిందికి వంగడం వంటి సాధారణ పనుల్లో కీళ్ల నొప్పి రావచ్చు. మొదట విశ్రాంతి తీసుకుంటే తగ్గినా, క్రమంగా పని ఆపిన తర్వాత కూడా నొప్పి కొనసాగవచ్చు. కండరాల నొప్పికి భిన్నంగా ఇది నేరుగా కీళ్ల ప్రాంతంలోనే ఉంటుంది.

కీళ్ల చుట్టూ వాపు

కీళ్లలో ద్రవం పేరుకుపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతం ఉబ్బినట్లు కనిపించవచ్చు. తాకినప్పుడు వేడిగా కూడా అనిపించవచ్చు. స్పష్టమైన కారణం లేకుండా వాపు పదేపదే వస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

కదలికలు తగ్గడం, శబ్దాలు రావడం

గతంలో సులభంగా కదిలిన కీళ్లు బిగుసుకుపోయి, చేతులు పైకి ఎత్తడం, మోకాళ్లపై కూర్చోవడం లేదా మోకాలిని పూర్తిగా చాపడం కష్టమవ్వవచ్చు. మృదులాస్థి దెబ్బతినడం, వాపు దీనికి కారణాలు కావచ్చు. కీళ్లు కదిలించినప్పుడు గరగర లేదా క్లిక్‌ శబ్దాలు రావడాన్ని ‘క్రెపిటస్‌’ అంటారు. నొప్పి లేని అప్పుడప్పుడు వచ్చే శబ్దాలు సాధారణంగా ఆందోళనకరం కాకపోవచ్చు. కానీ శబ్దాలతో పాటు నొప్పి లేదా వాపు ఉంటే వైద్య పరీక్ష అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 1:38 pm Digital Edition : Prabhanews
కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 16, 2026 1:30 PM ISTఉదయం నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి వస్తోందా? చేతులు పైకి ఎత్తడం, మోకాలిని పూర్తిగా చాపడం కష్టంగా మారిందా? చాలామంది ఈ సమస్యలను వయసు పెరగడం లేదా శారీరక శ్రమ వల్ల కలిగేవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇవే లక్షణాలు పదేపదే కనిపిస్తే వాటి వెనుక ఆర్థరైటిస్‌ ఉండే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.News18కీళ్ల సమస్యలు ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితోనే మొదలవ్వాలని లేదు. మొదట్లో స్వల్ప అసౌకర్యం, అప్పుడప్పుడు నొప్పి, కదలికల్లో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలామంది వీటిని వయసు పెరగడం లేదా శారీరక శ్రమ వల్ల వచ్చిన సమస్యలుగా భావించి పట్టించుకోరు. అయితే ఇవే లక్షణాలు పదేపదే ఎదురైతే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌ ప్రారంభ దశలో కనిపించే సంకేతాలను గుర్తించడం ద్వారా కీళ్ల కదలికలు, రోజువారీ జీవన నాణ్యతపై ప్రభావం పడకుండా తగిన సమయంలో వైద్య సలహా పొందవచ్చు.ఆహారపు అలవాట్లతోనూ సంబంధం ఉందా?భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (NIN) సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బాధితుల ఆహారపు అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యవంతులతో పోలిస్తే ఈ వ్యాధి ఉన్నవారి ఆహారంలో వైవిధ్యం తక్కువగా ఉండటంతో పాటు, సూక్ష్మపోషకాల అవసరాలు తగినంతగా తీరడం లేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే వారిలో వాపును ప్రోత్సహించే అవకాశం ఉన్న ఆహార విధానం ఎక్కువగా కనిపించింది.ఈ అధ్యయనంలో 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 615 మందిని పరిశీలించారు. వీరిలో 301 మంది కొత్తగా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నిర్ధారణ అయినవారు కాగా, 314 మంది ఆరోగ్యవంతులు. ఆహారం వల్ల శరీరంలో వాపు కలిగే అవకాశాన్ని అంచనా వేసే డైటరీ ఇన్‌ఫ్లమేటరీ ఇండెక్స్‌ (DII) మధ్యస్థ స్కోరు బాధితుల్లో 2.18గా నమోదైంది. ఆరోగ్యవంతుల్లో ఇది 0.37గా ఉంది. ఈ వివరాలను డెక్కన్‌ క్రానికల్‌ నివేదించింది.రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనేది రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కీళ్ల లోపలి పొరపై దాడి చేయడం వల్ల వాపు, నొప్పి, వాపుతో కూడిన ఉబ్బరం, బిగుతుదనం కలిగించే దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక వ్యాధి. మణిపాల్‌ హాస్పిటల్‌ ద్వారక, న్యూఢిల్లీలోని మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బోన్‌ అండ్‌ జాయింట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ వర్మ సూచనల ప్రకారం, కొన్ని లక్షణాలను ముందుగానే గుర్తించడం ముఖ్యం.ఉదయం కీళ్లు బిగుసుకుపోతున్నాయా?నిద్రలేచిన వెంటనే కీళ్లు బిగుతుగా అనిపించడం, కదలడానికి ఇబ్బంది పడటం ముఖ్యమైన సంకేతం. ఈ సమస్య తగ్గడానికి 30 నిమిషాల నుంచి గంట వరకు పట్టవచ్చు. రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం వల్ల కీళ్లలో మార్పులు, వాపు కారణంగా ఇలా జరగవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఈ లక్షణం కనిపిస్తే ఎముకలు, కీళ్ల వైద్యుడిని సంప్రదించాలి.పనులు చేసేటప్పుడు నొప్పిమెట్లు ఎక్కడం, వస్తువులను గట్టిగా పట్టుకోవడం, కిందికి వంగడం వంటి సాధారణ పనుల్లో కీళ్ల నొప్పి రావచ్చు. మొదట విశ్రాంతి తీసుకుంటే తగ్గినా, క్రమంగా పని ఆపిన తర్వాత కూడా నొప్పి కొనసాగవచ్చు. కండరాల నొప్పికి భిన్నంగా ఇది నేరుగా కీళ్ల ప్రాంతంలోనే ఉంటుంది.కీళ్ల చుట్టూ వాపుకీళ్లలో ద్రవం పేరుకుపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతం ఉబ్బినట్లు కనిపించవచ్చు. తాకినప్పుడు వేడిగా కూడా అనిపించవచ్చు. స్పష్టమైన కారణం లేకుండా వాపు పదేపదే వస్తే నిర్లక్ష్యం చేయకూడదు.కదలికలు తగ్గడం, శబ్దాలు రావడంగతంలో సులభంగా కదిలిన కీళ్లు బిగుసుకుపోయి, చేతులు పైకి ఎత్తడం, మోకాళ్లపై కూర్చోవడం లేదా మోకాలిని పూర్తిగా చాపడం కష్టమవ్వవచ్చు. మృదులాస్థి దెబ్బతినడం, వాపు దీనికి కారణాలు కావచ్చు. కీళ్లు కదిలించినప్పుడు గరగర లేదా క్లిక్‌ శబ్దాలు రావడాన్ని ‘క్రెపిటస్‌’ అంటారు. నొప్పి లేని అప్పుడప్పుడు వచ్చే శబ్దాలు సాధారణంగా ఆందోళనకరం కాకపోవచ్చు. కానీ శబ్దాలతో పాటు నొప్పి లేదా వాపు ఉంటే వైద్య పరీక్ష అవసరం.మరింత చదవండి

Source link