Last Updated:
Motorola Edge 70 Max | మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ విడుదలైంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5, 7100mAh బ్యాటరీ, AI కెమెరా, 2K AMOLED డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. జూలై 20 నుండి కొనొచ్చు.
మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‌ను విడుదల చేసింది. అత్యుత్తమ పనితీరు, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్, ఎక్కువసేపు కొనసాగే బ్యాటరీ, తెలివైన ఏఐ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, అత్యుత్తమ డిస్‌ప్లే టెక్నాలజీ, భారీ 7100mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, ప్రీమియం డిజైన్, ఏఐ కెమెరా టెక్నాలజీ, మల్టీ-డివైస్ ఏఐ అనుభవం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ గేమింగ్, మల్టీటాస్కింగ్, స్ట్రీమింగ్, ఏఐ ఆధారిత పనుల్లో అత్యంత వేగంగా పనిచేసేలా రూపొందించారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. క్వాడ్ HD+ (2K) ఎక్స్‌ట్రీమ్ అమొలెడ్ డిస్‌ప్లేతో ఇది వస్తోంది. ఫుల్ HD కంటే 77 శాతం ఎక్కువ పిక్సెల్స్ ఉండటంతో మరింత స్పష్టమైన చిత్రాలు కనిపిస్తాయి. ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి.
ఈ ఫోన్‌లో మోటరోలా ఇప్పటివరకు అందించిన అతిపెద్ద 7100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 58 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. స్ట్రీమింగ్, గేమింగ్, పని, ప్రయాణం వంటి సందర్భాల్లో రోజంతా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొద్ది నిమిషాల్లోనే గంటల పాటు ఉపయోగించేంత ఛార్జ్ వస్తుంది. అలాగే 25W Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉండటంతో కేబుల్ లేకుండానే వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ డార్క్ షాడో, పాంటోన్ ఐస్ మెల్ట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ, IP68/IP69 రేటింగ్స్ ఉండటంతో దుమ్ము, నీరు, గీతలు, పడిపోవడం వంటి పరిస్థితుల్లో కూడా మంచి రక్షణ లభిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP సోనీ లిటియా 710 సెన్సార్‌తో కూడిన ఏఐ కెమెరా సిస్టమ్ ఇచ్చారు. అదనంగా 8MP అల్ట్రా-వైడ్, మాక్రో లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 4K సెల్ఫీ వీడియోలు కూడా రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హెలో యూఎక్స్‌పై పనిచేస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్థాయి స్నాప్‌డ్రాగన్ పనితీరు, ఈ విభాగంలో ఉన్న ఏకైక క్వాడ్ HD+ (2K) డిస్‌ప్లే, అత్యంత వేగవంతమైన మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఏఐ కెమెరా టెక్నాలజీ, ప్రీమియం డిజైన్, కొత్త తరం క్రాస్-డివైస్ ఇంటెలిజెన్స్‌తో మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. వినియోగదారుల రోజువారీ అవసరాలను మరింత మెరుగుపరిచే టెక్నాలజీ, డిజైన్, సాఫ్ట్‌వేర్‌ను ఒకే ఫోన్‌లో అందించాలన్న మోటరోలా లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది.
మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ 8జీబీ + 256జీబీ ధర రూ.54,999 కాగా, 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.59,999. ఈ స్మార్ట్‌ఫోన్ 2026 జూలై 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్, దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. రూ.5,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ.5,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ పొందొచ్చు. అర్హత ఉన్న జియో రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన 5G ప్లాన్ తీసుకుంటే 18 నెలల పాటు గూగుల్ జెమినీ ప్రో ఉచితంగా ఉపయోగించవచ్చు. 5000జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. నెలకు రూ.200తో జియో ఓటీటీ పాస్ ద్వారా 15కు పైగా ప్రీమియం యాప్స్, 1000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను మొబైల్‌లో చూడొచ్చు.
Hyderabad,Telangana

