ప్రభన్యూస్

ఎల్‌నినో ప్రభావం.. రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పంటను వేయద్దంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క | వరంగల్ వార్తలు (Warangal News)


Last Updated:

ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. నీటి లభ్యత తగ్గుతున్నందున ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు.

+

News18

News18

ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోను రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న సంబంధిత శాఖల అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎల్‌నినో పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించడం వలన బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు.

జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్ రీఛార్జ్, తదితర పనులను చేపట్టి జలవనరులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో 315 మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, ప్రభుత్వం త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తుందన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.

భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నివేదికలను అందజేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. కాబట్టి రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 10:54 pm Digital Edition : Prabhanews
ఎల్‌నినో ప్రభావం.. రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పంటను వేయద్దంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క | వరంగల్ వార్తలు (Warangal News)

Last Updated:Oct 12, 2026 10:24 PM ISTఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. నీటి లభ్యత తగ్గుతున్నందున ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు.+
News18ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోను రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న సంబంధిత శాఖల అధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎల్‌నినో పరిస్థితుల కారణంగా నీటి లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించడం వలన బిందు సేద్యంతో పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు.జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్ రీఛార్జ్, తదితర పనులను చేపట్టి జలవనరులను కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో 315 మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉందని, ప్రభుత్వం త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తుందన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు ఉత్పన్నమవ్వకుండా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నివేదికలను అందజేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. కాబట్టి రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.మరింత చదవండి

Source link