ప్రభన్యూస్

WhatsApp Security Tips: మీ వాట్సాప్ సేఫ్‌గా ఉందా? హ్యాకర్లకు చెక్ పెట్టే 5 సూపర్ ఫీచర్లు గురించి తెలుసా? | బిజినెస్


ఇటీవల దేశంలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు వార్తలు వెలువడటంతో ఈ సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. తన వాట్సాప్ అకౌంట్‌ను మోసగాళ్లు స్వాధీనం చేసుకుని, తన కాంటాక్ట్ లిస్టులోని వ్యక్తులకు అత్యవసరంగా డబ్బు కావాలని సందేశాలు పంపారని తెలిపారు. కొద్ది గంటల్లోనే తిరిగి చెల్లిస్తామని చెబుతూ రూ.49 వేల వరకు పంపించాలని కోరినట్లు వెల్లడించారు. అంతకుముందు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ కావడంతో, ఆయన పేరుతో ఇతరులకు రూ.55 వేల వరకు డబ్బు పంపాలని సందేశాలు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తున్నాయి.

న్యూస్18 ఇంగ్లీష్ వెల్లడించిన కథనం ప్రకారం.. హ్యాకర్లు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. దానికి బదులుగా వారు వినియోగదారుల నిర్లక్ష్యాన్ని అవకాశంగా మార్చుకుంటారు. ఫిషింగ్ లింకులు పంపడం, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ చేయడం, ఓటీపీ లేదా వెరిఫికేషన్ కోడ్ అడగడం, సిమ్ స్వాపింగ్ వంటి పద్ధతుల ద్వారా అకౌంట్లను స్వాధీనం చేసుకుంటారు. చాలామంది తెలియక ఓటీపీ చెప్పేయడం లేదా నకిలీ లింక్‌పై క్లిక్ చేయడం వల్లే అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక త్వరలో వాట్సాప్ తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్ కూడా కొత్త అవకాశాలతో పాటు కొత్త ప్రమాదాలను తీసుకురావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్ వెల్లడించకుండా ఇతరులతో కనెక్ట్ కావచ్చు. ఇది గోప్యతకు మేలు చేసినప్పటికీ, మోసగాళ్లు అసలు వ్యక్తుల పేర్లకు దగ్గరగా ఒక అక్షరం మార్చి లేదా ఒక సంఖ్య జోడించి నకిలీ యూజర్‌నేమ్‌లు సృష్టించే అవకాశం ఉంది. అలాంటి అకౌంట్ల ద్వారా డబ్బు, ఓటీపీ లేదా వ్యక్తిగత సమాచారం అడిగితే వెంటనే స్పందించకుండా, ఆ వ్యక్తిని మరో ఫోన్ నంబర్ లేదా ఇతర విశ్వసనీయ మార్గంలో సంప్రదించి నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాస్‌కీస్ (Passkeys) ఫీచర్‌ను ఉపయోగించండి..

వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన ఫీచర్లలో Passkeys ఒకటి. ఇది సాధారణ SMS ఆధారిత ఓటీపీకి బదులుగా మీ ఫోన్‌లోని ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ లేదా స్క్రీన్ లాక్‌ను ఉపయోగించి లాగిన్‌ను ధృవీకరిస్తుంది. దీంతో హ్యాకర్లు మీ ఓటీపీని దొంగిలించినా కూడా అకౌంట్‌లోకి ప్రవేశించడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఫిషింగ్ దాడుల నుంచి ఈ ఫీచర్ మెరుగైన రక్షణ కల్పిస్తుంది.

రికవరీ ఈమెయిల్ తప్పనిసరిగా యాడ్ చేయండి..

వాట్సాప్ ఇప్పుడు ఖాతాకు ఈమెయిల్ చిరునామాను కూడా లింక్ చేసే సదుపాయం కల్పించింది. భవిష్యత్తులో మీ సిమ్ పనిచేయకపోయినా, ఫోన్ నంబర్ మారినా లేదా ఓటీపీ అందకపోయినా ఈ రికవరీ ఈమెయిల్ ద్వారా అకౌంట్‌ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈమెయిల్‌కు కూడా బలమైన పాస్‌వర్డ్‌తో పాటు Two-Factor Authentication తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి..

వాట్సాప్‌లో అత్యంత ముఖ్యమైన భద్రతా ఫీచర్లలో Two-Step Verification కూడా ఒకటి. దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత కొత్త డివైస్‌లో మీ మొబైల్ నంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఓటీపీతో పాటు మీరు సెట్ చేసిన 6 అంకెల ప్రత్యేక పిన్ కూడా అవసరం అవుతుంది. అంటే, హ్యాకర్లకు ఓటీపీ దొరికినా కూడా ఆ పిన్ లేకుండా ఖాతాలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. పుట్టిన తేదీ, 123456 వంటి సులభమైన సంఖ్యలకు బదులుగా ప్రత్యేకమైన పిన్‌ను ఎంచుకోవడం మరింత సురక్షితం.

బయోమెట్రిక్ లాక్‌ను యాక్టివేట్ చేయండి..

మీ ఫోన్ ఇతరుల చేతికి వెళ్లినా మీ వాట్సాప్‌ను రక్షించే మరో ముఖ్యమైన ఫీచర్ బయోమెట్రిక్ లాక్. ఐఫోన్ వినియోగదారులు Face ID, ఆండ్రాయిడ్ వినియోగదారులు Fingerprint Lock ద్వారా యాప్‌ను లాక్ చేసుకోవచ్చు. దీంతో మీ చాట్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత సమాచారం అనుమతి లేకుండా ఎవరూ చూడలేరు. ఫోన్ పోయిన సందర్భాల్లో కూడా ఈ ఫీచర్ అదనపు భద్రతను అందిస్తుంది.

క్యూ ఆర్ కోడ్‌లు, లింక్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలి..

మెటా ఇప్పటికే క్యూ ఆర్ కోడ్‌లు, అకౌంట్ లింకింగ్ స్కామ్‌లపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. హ్యాకర్లు నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేయమని చెప్పడం లేదా అకౌంట్‌ను మరో డివైస్‌కు లింక్ చేసే కోడ్‌ను పంపించడం ద్వారా మీ వాట్సాప్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అకౌంట్ లింక్ అయితే, మీ చాట్స్‌ను రహస్యంగా చదవడం, మీ పేరుతో ఇతరులను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి అనుమానాస్పద లింక్‌లు, క్యూ ఆర్ కోడ్‌లు వచ్చినా వాటిని వెంటనే స్కాన్ చేయకూడదు.

సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నారు. మీకు తెలిసిన వ్యక్తి పేరుతో వాట్సాప్‌లో డబ్బు పంపాలని మెసేజ్ వచ్చినా వెంటనే స్పందించకూడదు. ముందు ఆ వ్యక్తికి ఫోన్ చేసి లేదా మరో విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్ ద్వారా సంప్రదించి నిజంగానే ఆ అభ్యర్థన చేశారా లేదా అని నిర్ధారించుకోవాలి. కేవలం ఒక చిన్న ఫోన్ కాల్ మీ డబ్బును, మీ భద్రతను కాపాడగలదు. ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ మరింత అధునాతనంగా మారుతున్నాయి. అయితే, వాటిని ఎదుర్కోవడానికి వినియోగదారులు కూడా కొంత సమయం వెచ్చించి తమ అకౌంట్‌ను సురక్షితంగా మార్చుకోవాలి. Passkeys, Recovery Email, Two-Step Verification, Biometric Lock వంటి భద్రతా ఫీచర్లను యాక్టివేట్ చేయడం, అనుమానాస్పద యూజర్‌నేమ్‌లు, లింకులు, QR కోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా హ్యాకింగ్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 12:31 am Digital Edition : Prabhanews
WhatsApp Security Tips: మీ వాట్సాప్ సేఫ్‌గా ఉందా? హ్యాకర్లకు చెక్ పెట్టే 5 సూపర్ ఫీచర్లు గురించి తెలుసా? | బిజినెస్

ఇటీవల దేశంలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు వార్తలు వెలువడటంతో ఈ సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. తన వాట్సాప్ అకౌంట్‌ను మోసగాళ్లు స్వాధీనం చేసుకుని, తన కాంటాక్ట్ లిస్టులోని వ్యక్తులకు అత్యవసరంగా డబ్బు కావాలని సందేశాలు పంపారని తెలిపారు. కొద్ది గంటల్లోనే తిరిగి చెల్లిస్తామని చెబుతూ రూ.49 వేల వరకు పంపించాలని కోరినట్లు వెల్లడించారు. అంతకుముందు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ కావడంతో, ఆయన పేరుతో ఇతరులకు రూ.55 వేల వరకు డబ్బు పంపాలని సందేశాలు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తున్నాయి.న్యూస్18 ఇంగ్లీష్ వెల్లడించిన కథనం ప్రకారం.. హ్యాకర్లు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. దానికి బదులుగా వారు వినియోగదారుల నిర్లక్ష్యాన్ని అవకాశంగా మార్చుకుంటారు. ఫిషింగ్ లింకులు పంపడం, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ చేయడం, ఓటీపీ లేదా వెరిఫికేషన్ కోడ్ అడగడం, సిమ్ స్వాపింగ్ వంటి పద్ధతుల ద్వారా అకౌంట్లను స్వాధీనం చేసుకుంటారు. చాలామంది తెలియక ఓటీపీ చెప్పేయడం లేదా నకిలీ లింక్‌పై క్లిక్ చేయడం వల్లే అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇక త్వరలో వాట్సాప్ తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్ కూడా కొత్త అవకాశాలతో పాటు కొత్త ప్రమాదాలను తీసుకురావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్ వెల్లడించకుండా ఇతరులతో కనెక్ట్ కావచ్చు. ఇది గోప్యతకు మేలు చేసినప్పటికీ, మోసగాళ్లు అసలు వ్యక్తుల పేర్లకు దగ్గరగా ఒక అక్షరం మార్చి లేదా ఒక సంఖ్య జోడించి నకిలీ యూజర్‌నేమ్‌లు సృష్టించే అవకాశం ఉంది. అలాంటి అకౌంట్ల ద్వారా డబ్బు, ఓటీపీ లేదా వ్యక్తిగత సమాచారం అడిగితే వెంటనే స్పందించకుండా, ఆ వ్యక్తిని మరో ఫోన్ నంబర్ లేదా ఇతర విశ్వసనీయ మార్గంలో సంప్రదించి నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.పాస్‌కీస్ (Passkeys) ఫీచర్‌ను ఉపయోగించండి..వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన ఫీచర్లలో Passkeys ఒకటి. ఇది సాధారణ SMS ఆధారిత ఓటీపీకి బదులుగా మీ ఫోన్‌లోని ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ లేదా స్క్రీన్ లాక్‌ను ఉపయోగించి లాగిన్‌ను ధృవీకరిస్తుంది. దీంతో హ్యాకర్లు మీ ఓటీపీని దొంగిలించినా కూడా అకౌంట్‌లోకి ప్రవేశించడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఫిషింగ్ దాడుల నుంచి ఈ ఫీచర్ మెరుగైన రక్షణ కల్పిస్తుంది.రికవరీ ఈమెయిల్ తప్పనిసరిగా యాడ్ చేయండి..వాట్సాప్ ఇప్పుడు ఖాతాకు ఈమెయిల్ చిరునామాను కూడా లింక్ చేసే సదుపాయం కల్పించింది. భవిష్యత్తులో మీ సిమ్ పనిచేయకపోయినా, ఫోన్ నంబర్ మారినా లేదా ఓటీపీ అందకపోయినా ఈ రికవరీ ఈమెయిల్ ద్వారా అకౌంట్‌ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈమెయిల్‌కు కూడా బలమైన పాస్‌వర్డ్‌తో పాటు Two-Factor Authentication తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి..వాట్సాప్‌లో అత్యంత ముఖ్యమైన భద్రతా ఫీచర్లలో Two-Step Verification కూడా ఒకటి. దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత కొత్త డివైస్‌లో మీ మొబైల్ నంబర్‌తో వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఓటీపీతో పాటు మీరు సెట్ చేసిన 6 అంకెల ప్రత్యేక పిన్ కూడా అవసరం అవుతుంది. అంటే, హ్యాకర్లకు ఓటీపీ దొరికినా కూడా ఆ పిన్ లేకుండా ఖాతాలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. పుట్టిన తేదీ, 123456 వంటి సులభమైన సంఖ్యలకు బదులుగా ప్రత్యేకమైన పిన్‌ను ఎంచుకోవడం మరింత సురక్షితం.బయోమెట్రిక్ లాక్‌ను యాక్టివేట్ చేయండి..మీ ఫోన్ ఇతరుల చేతికి వెళ్లినా మీ వాట్సాప్‌ను రక్షించే మరో ముఖ్యమైన ఫీచర్ బయోమెట్రిక్ లాక్. ఐఫోన్ వినియోగదారులు Face ID, ఆండ్రాయిడ్ వినియోగదారులు Fingerprint Lock ద్వారా యాప్‌ను లాక్ చేసుకోవచ్చు. దీంతో మీ చాట్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత సమాచారం అనుమతి లేకుండా ఎవరూ చూడలేరు. ఫోన్ పోయిన సందర్భాల్లో కూడా ఈ ఫీచర్ అదనపు భద్రతను అందిస్తుంది.క్యూ ఆర్ కోడ్‌లు, లింక్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలి..మెటా ఇప్పటికే క్యూ ఆర్ కోడ్‌లు, అకౌంట్ లింకింగ్ స్కామ్‌లపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. హ్యాకర్లు నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేయమని చెప్పడం లేదా అకౌంట్‌ను మరో డివైస్‌కు లింక్ చేసే కోడ్‌ను పంపించడం ద్వారా మీ వాట్సాప్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అకౌంట్ లింక్ అయితే, మీ చాట్స్‌ను రహస్యంగా చదవడం, మీ పేరుతో ఇతరులను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి అనుమానాస్పద లింక్‌లు, క్యూ ఆర్ కోడ్‌లు వచ్చినా వాటిని వెంటనే స్కాన్ చేయకూడదు.సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నారు. మీకు తెలిసిన వ్యక్తి పేరుతో వాట్సాప్‌లో డబ్బు పంపాలని మెసేజ్ వచ్చినా వెంటనే స్పందించకూడదు. ముందు ఆ వ్యక్తికి ఫోన్ చేసి లేదా మరో విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్ ద్వారా సంప్రదించి నిజంగానే ఆ అభ్యర్థన చేశారా లేదా అని నిర్ధారించుకోవాలి. కేవలం ఒక చిన్న ఫోన్ కాల్ మీ డబ్బును, మీ భద్రతను కాపాడగలదు. ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ మరింత అధునాతనంగా మారుతున్నాయి. అయితే, వాటిని ఎదుర్కోవడానికి వినియోగదారులు కూడా కొంత సమయం వెచ్చించి తమ అకౌంట్‌ను సురక్షితంగా మార్చుకోవాలి. Passkeys, Recovery Email, Two-Step Verification, Biometric Lock వంటి భద్రతా ఫీచర్లను యాక్టివేట్ చేయడం, అనుమానాస్పద యూజర్‌నేమ్‌లు, లింకులు, QR కోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా హ్యాకింగ్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

Source link