ఫిట్‌నెస్ నిపుణులు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఏ ఒక్క వ్యాయామం లేదా ఒక్క పద్ధతి మాత్రమే అద్భుతంగా బరువు తగ్గించదు. ఆరోగ్యకరమైన బరువును నియంత్రించాలంటే సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడా నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. అలాగే నడుము, వెన్నెముక, తుంటి లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ తరహా వ్యాయామాలను ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల లేదా ఫిజియోథెరపిస్టుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జపాన్ ప్రజల ఆరోగ్య రహస్యాల్లో హరా హచి బు అనే అలవాటు కూడా ప్రముఖమైనది. అంటే కడుపు పూర్తిగా నిండే వరకు కాకుండా దాదాపు 80 శాతం మాత్రమే తినడం, ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వంటి అలవాట్లను వారు పాటిస్తారు. టవల్ స్ట్రెచ్ థెరపీతో పాటు ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరిస్తే శరీర ఫిట్‌నెస్ మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నప్పటికీ, దీన్ని బరువు తగ్గించే అద్భుత పరిష్కారంగా భావించడం మాత్రం సరైంది కాదని హెచ్చరిస్తున్నారు.

