ప్రభన్యూస్

Ulavacharu Recipe: ఉలవచారు ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! | లైఫ్ స్టైల్


Last Updated:

ఉలవచారు ఇంట్లో తయారు చేయడం కష్టమని కొందరు భావిస్తుంటారు. మరికొందరు ఇంట్లో చేసినా బయట దొరికేంత రుచి రావడం లేదని అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఉలవచారు చేసుకోవచ్చు.

News18
News18

ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టమైన వంటకం. ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఉలవచారుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వేడివేడి అన్నంలో ఉలవచారు వేసుకుని, కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే ఉలవచారు ఇంట్లో తయారు చేయడం కష్టమని కొందరు భావిస్తుంటారు. మరికొందరు ఇంట్లో చేసినా బయట దొరికేంత రుచి రావడం లేదని అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఉలవచారు చేసుకోవచ్చు.

ఉలవచారు తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు ఉలవలు, ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా కరివేపాకు, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, సుమారు 30 గ్రాముల చింతపండు అవసరం. మీ రుచికి తగ్గట్టుగా కారం, మిరియాల పొడి పరిమాణాన్ని కొద్దిగా మార్చుకోవచ్చు.

ముందుగా ఉలవలను ఒక గిన్నెలో వేసి నీటితో బాగా కడగాలి. ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసి కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఉలవలు బాగా నానితే త్వరగా ఉడకడంతో పాటు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. మరుసటి రోజు నానబెట్టిన నీటిని తీసేసి ఉలవలను మరోసారి కడగాలి. అనంతరం గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి.

ఇదిలా ఉండగా చింతపండును ఒక గిన్నెలో వేసి సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి సుమారు 15 నిమిషాలు నానబెట్టాలి. చింతపండు మెత్తగా అయిన తర్వాత చేత్తో బాగా పిసికి రసాన్ని తీసుకోవాలి. చింతపండు గుజ్జు లేదా పీచు రసంలో ఉండకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఉడికించిన ఉలవలను మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.

ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసిన ఉలవల పేస్ట్ వేసి బాగా కలపాలి. అనంతరం సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి మరోసారి కలపాలి. అవసరమైనంత నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మంటను మీడియంగా ఉంచి మూతపెట్టి సుమారు 20 నిమిషాలు మరిగించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఉలవచారు కొద్దిగా చిక్కగా మారి మంచి వాసన రావడం మొదలైతే స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే.. ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే ఉలవచారు సిద్ధం. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. పప్పు, కూరలతో పాటు ఉలవచారును సైడ్ డిష్‌గా కూడా వడ్డించుకోవచ్చు. ఒకసారి ఈ పద్ధతిలో ఇంట్లో తయారు చేసి చూస్తే, బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 October 2026, 11:58 am Digital Edition : Prabhanews
Ulavacharu Recipe: ఉలవచారు ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 01, 2026 11:49 AM ISTఉలవచారు ఇంట్లో తయారు చేయడం కష్టమని కొందరు భావిస్తుంటారు. మరికొందరు ఇంట్లో చేసినా బయట దొరికేంత రుచి రావడం లేదని అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఉలవచారు చేసుకోవచ్చు.News18ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టమైన వంటకం. ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఉలవచారుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వేడివేడి అన్నంలో ఉలవచారు వేసుకుని, కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. అయితే ఉలవచారు ఇంట్లో తయారు చేయడం కష్టమని కొందరు భావిస్తుంటారు. మరికొందరు ఇంట్లో చేసినా బయట దొరికేంత రుచి రావడం లేదని అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఉలవచారు చేసుకోవచ్చు.ఉలవచారు తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు ఉలవలు, ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా కరివేపాకు, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, సుమారు 30 గ్రాముల చింతపండు అవసరం. మీ రుచికి తగ్గట్టుగా కారం, మిరియాల పొడి పరిమాణాన్ని కొద్దిగా మార్చుకోవచ్చు.ముందుగా ఉలవలను ఒక గిన్నెలో వేసి నీటితో బాగా కడగాలి. ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసి కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఉలవలు బాగా నానితే త్వరగా ఉడకడంతో పాటు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. మరుసటి రోజు నానబెట్టిన నీటిని తీసేసి ఉలవలను మరోసారి కడగాలి. అనంతరం గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి.ఇదిలా ఉండగా చింతపండును ఒక గిన్నెలో వేసి సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి సుమారు 15 నిమిషాలు నానబెట్టాలి. చింతపండు మెత్తగా అయిన తర్వాత చేత్తో బాగా పిసికి రసాన్ని తీసుకోవాలి. చింతపండు గుజ్జు లేదా పీచు రసంలో ఉండకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఉడికించిన ఉలవలను మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసిన ఉలవల పేస్ట్ వేసి బాగా కలపాలి. అనంతరం సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి మరోసారి కలపాలి. అవసరమైనంత నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మంటను మీడియంగా ఉంచి మూతపెట్టి సుమారు 20 నిమిషాలు మరిగించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఉలవచారు కొద్దిగా చిక్కగా మారి మంచి వాసన రావడం మొదలైతే స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే.. ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే ఉలవచారు సిద్ధం. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. పప్పు, కూరలతో పాటు ఉలవచారును సైడ్ డిష్‌గా కూడా వడ్డించుకోవచ్చు. ఒకసారి ఈ పద్ధతిలో ఇంట్లో తయారు చేసి చూస్తే, బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.మరింత చదవండి

Source link