1. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం.. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ కార్తీక్ తెలిపారు. తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు మంటను తగ్గిస్తాయి. ఈ మిశ్రమం శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి జలుబు, పొడి దగ్గు నుండి వేగంగా ఉపశమనం కలిగిస్తుంది.
