దగ్గు, జలుబు, గొంతునొప్పి, రోగనిరోధక శక్తి పెంపునకు తులసి ఆకుల రసం లేదా తులసి టీ అద్భుతమైన దివ్యౌషధంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్ని ఔషధ గుణాలు, దైవిక శక్తులు ఉన్నప్పటికీ.. తులసి ఆకులు అందరికీ అమృతంలా పనిచేయవని పేర్కొంటున్నారు. కొన్ని రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి, నిర్దిష్ట శారీరక పరిస్థితుల్లో ఉన్నవారికి తులసి ఆకులు హానికరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా తులసి ఆకులను ఎక్కువగా తినకూడని ఆ 5 వర్గాల వ్యక్తుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

