Last Updated:
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల పాత్ర క్రమంగా మారుతోంది. కేవలం అందం, అభినయానికే పరిమితం కాకుండా పలువురు హీరోయిన్స్, నేడు నిర్మాణ రంగంలో, దర్శకత్వంలో, రచనా విభాగంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల పాత్ర క్రమంగా మారుతోంది. కేవలం అందం, అభినయానికే పరిమితం కాకుండా పలువురు హీరోయిన్స్, నేడు నిర్మాణ రంగంలో, దర్శకత్వంలో, రచనా విభాగంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. వన్ ఉమెన్ ఆర్మీ తరహాలో రాణిస్తున్న వారిలో యువ నటి, నిర్మాత సుమయా రెడ్డి ఒకరు. ఇటీవల విడుదలైన ‘డియర్ ఉమ’ (Dear Uma) సినిమాతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆమె కేవలం ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా.. నిర్మాతగా, రచయితగా బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మొదటి సినిమాతోనే తనలోని మల్టీ టాలెంట్‌ను నిరూపించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు.
దీపావళి పండుగ కానుకగా సుమయా రెడ్డి తన రెండవ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘సుమ చిత్ర ఆర్ట్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ ప్రేక్షకులకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యేలా డిజైన్ చేశారు. అందులో సుమయా రెడ్డి కుప్పలు తెప్పలుగా ఉన్న కరెన్సీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాల మధ్య అచ్చం ఒక మహారాణిలా దర్పంగా కూర్చుని దర్శనమిచ్చారు.
పోస్టర్ లోని ఆమె రాజసం, చుట్టూ ఉన్న సంపద చూసి ఇదేదో భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా లేదా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని అందరూ భావించారు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ ‘హారర్-కామెడీ’ జానర్‌లో రూపొందిస్తున్నారట. టాలీవుడ్‌లో హారర్ కామెడీ అనగానే సాధారణంగా పాడుబడిన బంగ్లాలు, చీకటి గదులు, దెయ్యాల చుట్టూ తిరిగే కథలు గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో కట్టల కొద్దీ డబ్బు, లంకె బిందెల్లాంటి బంగారానికి, హారర్ థీమ్‌కి ముడిపెట్టడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దెయ్యానికి, ఇంతటి భారీ సంపదకు ఉన్న సంబంధం ఏంటి? ఆస్తుల కోసం జరిగే కుట్రల నేపథ్యంలో ఈ కథ సాగుతుందా? లేక గుప్త నిధులను కాపాడే మహారాణి ఆత్మ కథనా? అనే చర్చ సినీ వర్గాల్లో, నెటిజన్లలో మొదలైంది. ఇప్పటివరకు తెలుగు తెరపై రాని ఒక సరికొత్త పాయింట్‌తో సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక ప్రీ-లుక్ పోస్టర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ నూటికి నూరు శాతం సఫలమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్రేజీ టైటిల్ అనౌన్స్‌మెంట్, దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. మొత్తానికి సుమయా రెడ్డి రెండవ అడుగుతో టాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

