The Paradise Movie: పెద్దిని, పుష్పను మిక్సీలో రుబ్బితే ‘ది ప్యారడైజ్’ సినిమానా?.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న స్టోరీ! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఎల్లుండి రాత్రి నుంచి ప్రీమియర్లతో ది ప్యారడైజ్ హవా స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ హర్ట్ హిట్టింగ్ డ్రామాలో నాని జడల్ జమానా పాత్రలో నటిస్తున్నాడు.

News18
News18

ఎల్లుండి రాత్రి నుంచి ప్రీమియర్లతో ది ప్యారడైజ్ హవా స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ హర్ట్ హిట్టింగ్ డ్రామాలో నాని జడల్ జమానా పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లేకుండానే సినిమాను రిలీజ్ చేయనుండటంతో అసలు సినిమా ఎలా ఉండబోతుంది? కాన్సెప్ట్ ఏంటీ? నాని పాత్ర ఎలా ఉండబోతుంది? ఇలా ఎన్నో విషయాల గురించి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.

ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా కేవలం ఓ సాధారణ యాక్షన్ కథ కాదని, ఓ ప్రత్యేకమైన సంచార జాతి జీవితం, వాళ్ల అస్తిత్వం, గుర్తింపు కోసం సాగిన పోరాటం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన ‘షికారి’ అనే సంచార జాతి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినట్లు సమాచారం. అప్పట్లో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. వేట, దొంగతనాలు వంటి వాటినే జీవనాధారంగా చేసుకుని ఈ సమాజానికి చెందిన కుటుంబాలు జీవించేవారని చెబుతారు. మరోవైపు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ దేవుళ్లను ఆరాధించడం కూడా వాళ్ల జీవన విధానంలో భాగంగా ఉండేదని సమాచారం.

అయితే కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. చాలా కాలం పాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఈ సమాజానికి సరైన గుర్తింపు లేకపోవడంతో.. రేషన్ కార్డులు, ఓటు హక్కు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు. ఏ ప్రభుత్వమూ తమను పట్టించుకోవడం లేదనే పరిస్థితుల్లో.. దొంగతనాలు చేస్తూ జీవనం సాగించాల్సి వచ్చిందనే కథనాలు ఉన్నాయి.

అయితే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమాజం పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు సమాచారం. షికారి కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు.. వారిని బీసీ వర్గాల్లో గుర్తించే ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. ఆ తర్వాత జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. దొంగతనాల నుంచి కొందరు నాటు సారా తయారీ, విక్రయాల వైపు మళ్లినట్లు సమాచారం.

ఇక్కడే మరో సమస్య మొదలైనట్లు చెబుతారు. ప్రభుత్వ అనుమతులతో సారా దుకాణాలు నిర్వహించే రాజకీయ నాయకులు, షికారి సమాజానికి చెందిన వ్యక్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని సమాచారం. ఈ క్రమంలో వారిపై జరిగిన దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా సమాజంలో తిరుగుబాటు మొదలైందని చెబుతారు. ఈ నేపథ్యమే ‘ది ప్యారడైజ్’ కథకు స్ఫూర్తిగా మారినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో ఒక సంచార జాతిని నడిపించే నాయకుడి కథను శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే హీరో పోరాటం కేవలం తన వ్యక్తిగత జీవితం కోసం ఉండదని.. తనతో పాటు తన జాతి మొత్తానికి ఒక గుర్తింపు తీసుకురావడమే అతడి ప్రధాన లక్ష్యంగా ఉంటుందని సమాచారం. ఈ పాయింట్‌ను చూస్తే ‘పుష్ప’, ‘పెద్ది’ సినిమాలతో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ‘పుష్ప’లో హీరో తన కుటుంబానికి, తన ఇంటిపేరుకు గుర్తింపు కోసం పోరాడుతాడు. ‘పెద్ది’లో కథానాయకుడి పోరాటం తన ఊరి గౌరవం, గుర్తింపు చుట్టూ సాగుతుంది. కానీ ‘ది ప్యారడైజ్’లో మాత్రం కథానాయకుడి పోరాటం తనకోసం మాత్రమే కాకుండా.. తన జాతి మొత్తానికి గుర్తింపు తీసుకురావడం కోసం ఉంటుందని సమాచారం. నిజానికి ఇదే కథతో సినిమా వస్తే మాత్రం రికార్డులు తిరగరాయడం పక్కా.

అంటే నిజ జీవితంలోని కొన్ని సామాజిక అంశాలు, చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకున్నప్పటికీ.. తెరపై మాత్రం పూర్తిగా కల్పిత కథగా ‘ది ప్యారడైజ్’ను చూపించబోతున్నారని సమాచారం. మరి ఈ సంచార జాతి నేపథ్యాన్ని శ్రీకాంత్ ఓదెల తనదైన స్టైల్‌లో ఎలా చూపించారు? నాని పాత్రకు ఈ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? జాతి గుర్తింపు కోసం హీరో చేసే పోరాటం ఎలా సాగుతుంది? అనేది సినిమా విడుదలయ్యాకే పూర్తిగా తెలియనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 September 2026, 10:06 am Digital Edition : Prabhanews
The Paradise Movie: పెద్దిని, పుష్పను మిక్సీలో రుబ్బితే ‘ది ప్యారడైజ్’ సినిమానా?.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న స్టోరీ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 21, 2026 10:03 AM ISTఎల్లుండి రాత్రి నుంచి ప్రీమియర్లతో ది ప్యారడైజ్ హవా స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ హర్ట్ హిట్టింగ్ డ్రామాలో నాని జడల్ జమానా పాత్రలో నటిస్తున్నాడు.News18ఎల్లుండి రాత్రి నుంచి ప్రీమియర్లతో ది ప్యారడైజ్ హవా స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ హర్ట్ హిట్టింగ్ డ్రామాలో నాని జడల్ జమానా పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ లేకుండానే సినిమాను రిలీజ్ చేయనుండటంతో అసలు సినిమా ఎలా ఉండబోతుంది? కాన్సెప్ట్ ఏంటీ? నాని పాత్ర ఎలా ఉండబోతుంది? ఇలా ఎన్నో విషయాల గురించి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా కేవలం ఓ సాధారణ యాక్షన్ కథ కాదని, ఓ ప్రత్యేకమైన సంచార జాతి జీవితం, వాళ్ల అస్తిత్వం, గుర్తింపు కోసం సాగిన పోరాటం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన ‘షికారి’ అనే సంచార జాతి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినట్లు సమాచారం. అప్పట్లో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. వేట, దొంగతనాలు వంటి వాటినే జీవనాధారంగా చేసుకుని ఈ సమాజానికి చెందిన కుటుంబాలు జీవించేవారని చెబుతారు. మరోవైపు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ దేవుళ్లను ఆరాధించడం కూడా వాళ్ల జీవన విధానంలో భాగంగా ఉండేదని సమాచారం.అయితే కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. చాలా కాలం పాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఈ సమాజానికి సరైన గుర్తింపు లేకపోవడంతో.. రేషన్ కార్డులు, ఓటు హక్కు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతారు. ఏ ప్రభుత్వమూ తమను పట్టించుకోవడం లేదనే పరిస్థితుల్లో.. దొంగతనాలు చేస్తూ జీవనం సాగించాల్సి వచ్చిందనే కథనాలు ఉన్నాయి.అయితే ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమాజం పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్లు సమాచారం. షికారి కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు.. వారిని బీసీ వర్గాల్లో గుర్తించే ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. ఆ తర్వాత జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. దొంగతనాల నుంచి కొందరు నాటు సారా తయారీ, విక్రయాల వైపు మళ్లినట్లు సమాచారం.ఇక్కడే మరో సమస్య మొదలైనట్లు చెబుతారు. ప్రభుత్వ అనుమతులతో సారా దుకాణాలు నిర్వహించే రాజకీయ నాయకులు, షికారి సమాజానికి చెందిన వ్యక్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని సమాచారం. ఈ క్రమంలో వారిపై జరిగిన దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా సమాజంలో తిరుగుబాటు మొదలైందని చెబుతారు. ఈ నేపథ్యమే ‘ది ప్యారడైజ్’ కథకు స్ఫూర్తిగా మారినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ సినిమాలో ఒక సంచార జాతిని నడిపించే నాయకుడి కథను శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే హీరో పోరాటం కేవలం తన వ్యక్తిగత జీవితం కోసం ఉండదని.. తనతో పాటు తన జాతి మొత్తానికి ఒక గుర్తింపు తీసుకురావడమే అతడి ప్రధాన లక్ష్యంగా ఉంటుందని సమాచారం. ఈ పాయింట్‌ను చూస్తే ‘పుష్ప’, ‘పెద్ది’ సినిమాలతో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ‘పుష్ప’లో హీరో తన కుటుంబానికి, తన ఇంటిపేరుకు గుర్తింపు కోసం పోరాడుతాడు. ‘పెద్ది’లో కథానాయకుడి పోరాటం తన ఊరి గౌరవం, గుర్తింపు చుట్టూ సాగుతుంది. కానీ ‘ది ప్యారడైజ్’లో మాత్రం కథానాయకుడి పోరాటం తనకోసం మాత్రమే కాకుండా.. తన జాతి మొత్తానికి గుర్తింపు తీసుకురావడం కోసం ఉంటుందని సమాచారం. నిజానికి ఇదే కథతో సినిమా వస్తే మాత్రం రికార్డులు తిరగరాయడం పక్కా.అంటే నిజ జీవితంలోని కొన్ని సామాజిక అంశాలు, చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకున్నప్పటికీ.. తెరపై మాత్రం పూర్తిగా కల్పిత కథగా ‘ది ప్యారడైజ్’ను చూపించబోతున్నారని సమాచారం. మరి ఈ సంచార జాతి నేపథ్యాన్ని శ్రీకాంత్ ఓదెల తనదైన స్టైల్‌లో ఎలా చూపించారు? నాని పాత్రకు ఈ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? జాతి గుర్తింపు కోసం హీరో చేసే పోరాటం ఎలా సాగుతుంది? అనేది సినిమా విడుదలయ్యాకే పూర్తిగా తెలియనుంది.మరింత చదవండి

Source link