తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ నవంబర్ రెండో వారంలో, అలాగే వివాహ మహోత్సవం డిసెంబర్ నెలలో అత్యంత వైభవంగా జరగనుందని సమాచారం. రాజస్థాన్‌లోని ప్రముఖ చారిత్రక, పర్యాటక నగరమైన ఉదయ్‌పుర్‌ను తమ డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఈ వివాహ వేడుకను చాలా ప్రైవేట్‌గా, సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారని టాక్. ఆ తర్వాత రాజకీయ నాయకులు, మిత్రుల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ రిసెప్షన్ వేడుకను ఘనంగా ప్లాన్ చేస్తున్నారు.

