Last Updated:
టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ కలిసి 5జీ సదుపాయంతో సియెరా.ఈవీని తీసుకొస్తున్నాయి. ఇదెలా పనిచేస్తుందో తెలుసుకోండి.
ఎలక్ట్రిక్ కార్లలో టెక్నాలజీ మరింత వేగంగా మారుతోంది. ఇప్పుడు కారులోనే హైస్పీడ్ ఇంటర్నెట్, రిమోట్ డయాగ్నస్టిక్స్, వేగవంతమైన సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ దిశగా టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) కలిసి సియెరా.ఈవీలో ఇన్‌బిల్ట్ 5జీ కనెక్టివిటీని తీసుకురావడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని పీటీఐ వెల్లడించింది. మంగళవారం ప్రకటించిన ఈ భాగస్వామ్యం ద్వారా సియెరా.ఈవీకి 5జీ సెల్యులార్ కనెక్టివిటీ అందుతుంది. భారత్‌లో సాఫ్ట్వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్‌డీవీలు) వినియోగాన్ని వేగంగా పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ భాగస్వామ్యంలో భాగంగా టాటా కమ్యూనికేషన్స్ మూవ్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌ను సియెరా.ఈవీలోని ఎస్‌డీవీ ప్లాట్‌ఫామ్ ఎన్.ఐఓతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల కారులో కనెక్టివిటీ మరింత సులభంగా అందుతుంది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా కొత్త ఇన్-వెహికల్ అనుభవాలు కూడా అందుబాటులోకి వస్తాయని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

