రైలు నంబర్ 07535 చర్లపల్లి – నాగర్‌కోయిల్ స్పెషల్ రాత్రి 7.45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10.45 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 మధ్య ఈ రైలును మూడు సార్లు నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07536 నాగర్‌కోయిల్ – చర్లపల్లి స్పెషల్ అర్ధరాత్రి 12.45 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. నవంబర్ 1 నుంచి 15 మధ్య ఈ రైలును కూడా మూడు సార్లు నడపనున్నారు. ఈ రెండు రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సత్తూర్, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, వల్లియూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

