సోలార్ ఎక్స్‌పర్ట్ ఆదిత్య ప్రభాకర్ తెలిపిన మరో ఉదాహరణ ప్రకారం, రూ.2,10,000 విలువైన 3 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే వినియోగదారు సుమారు రూ.21,000 డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన మొత్తానికి ప్రభుత్వ బ్యాంకులు రుణం ఇస్తాయి. బ్యాంకు అంచనాల ఆధారంగా సుమారు రూ.1,89,000 నుంచి రూ.1,98,000 వరకు రుణం లభించవచ్చు. ఈఎంఐ నెలకు సుమారు రూ.2,100 నుంచి రూ.2,150 వరకు ఉండొచ్చు. వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి రూ.78,000 సబ్సిడీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

