సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె, తన కష్టంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి, భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా గ్లామర్ పాత్రల ద్వారా ఆమె ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

