Z2 వేరియంట్లో డ్యూయల్ బ్యారెల్ ఎంఎఫ్ఆర్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్ (ఓఆర్వీఎం), R17 స్టీల్ వీల్స్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.66 సెం.మీ మోనోక్రోమ్ క్లస్టర్, 4 స్పీకర్లు, ఈఎస్పీ, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, 3-పాయింట్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్, ముందు, వెనుక వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, రెండో వరుసలో 15W యూఎస్బీ సీ చార్జింగ్ పోర్ట్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, రెండో వరుస ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Z4 లో Z2 కంటే అదనపు ఫీచర్లున్నాయి. Z4 వేరియంట్లో 20.32 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో/కార్ప్లే (వైర్డ్), రెండో వరుస ఏసీ మాడ్యూల్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఓఆర్వీఎం, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వైపర్, వాషర్, డిమిస్టర్, స్కీ ర్యాక్, రియర్ స్పాయిలర్, షిఫ్ట్ ఆన్ ఫ్లై (డీజిల్ 4WD) వంటి ఫీచర్లు ఉన్నాయి. (image: Mahindra)
