సాధారణంగా బ్యాంకులు తమ రుణ కార్యకలాపాల్లో భాగంగా ఆస్తులను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. హోమ్ లోన్, ప్రాపర్టీ లోన్ తీసుకొని రుణాలు చెల్లించకపోవడం వల్ల అవి నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్పీఏలు) మారితే, బ్యాంకులు చట్టపరమైన లేదా ఒప్పందపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా, రుణానికి హామీగా పెట్టిన స్థిరాస్తిపై బ్యాంకులు యాజమాన్య హక్కులు పొందవచ్చు. అంటే ఇల్లు, భూమి వంటి ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు. ఇలా వివిధ మార్గాల్లో బ్యాంకులు స్వాధీనం చేసుకునే ఆర్థికేతర ఆస్తులు, నాన్-బ్యాంకింగ్ ఆస్తుల నిర్వహణకు స్పష్టత ఇవ్వడానికి ఆర్బీఐ కొత్త ప్రూడెన్షియల్ నిబంధనలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)

