ముందుగా ఒక పెద్ద గిన్నెలో అర కప్పు సన్నని రవ్వ, అర కప్పు బియ్యప్పిండి, పావు కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, అర చెంచా జీలకర్ర, కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. రుచికి అనుగుణంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తురిమిన అల్లం కూడా కలుపుకోవచ్చు. ఒక చెంచా పెరుగు వేస్తే దోశకు మంచి రంగు, రుచి వస్తుంది. అయితే పెరుగు వేయడం తప్పనిసరి కాదు.

