ప్రభన్యూస్

Rava Kesari: రవ్వ కేసరి చేసే అసలైన పద్ధతి ఇదే.. గరిటెకు అతుక్కోకుండా మెత్తగా రావాలంటే ఇలా చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

సరైన కొలతలు పాటించడంతో పాటు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుడిలో ప్రసాదంలా మెత్తగా, రుచిగా ఉండే రవ్వ కేసరిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను కేవలం 10–15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.

News18
News18

పండుగలు, వ్రతాలు, పూజల సమయంలో దేవతలకు నైవేద్యంగా వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేస్తుంటారు. అలాంటి వాటిలో రవ్వ కేసరికి ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ సమయంలో, ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు రవ్వ కేసరి మరీ గట్టిగా మారడం, నీళ్లలా పలుచగా ఉండటం లేదా రవ్వలో ఉండలు ఏర్పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన కొలతలు పాటించడంతో పాటు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుడిలో ప్రసాదంలా మెత్తగా, రుచిగా ఉండే రవ్వ కేసరిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను కేవలం 10–15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు: ఈ రవ్వ కేసరి తయారీకి రెండు కప్పుల బొంబాయి రవ్వ, మూడు కప్పుల పంచదార, ఆరు కప్పుల నీరు, ఒక కప్పు నెయ్యి, జీడిపప్పు పలుకులు ఐదారు టీస్పూన్లు, కిస్‌మిస్‌లు మూడు టీస్పూన్లు, ఒక టీస్పూన్ యాలకుల పొడి అవసరం. రవ్వను వేయించడానికి కొద్దిగా నెయ్యి అదనంగా తీసుకోవాలి. కేసరికి మంచి రంగు రావాలనుకుంటే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా ఐచ్ఛికం.

తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు పలుకులను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత కిస్‌మిస్‌లు వేసి అవి కొద్దిగా ఉబ్బే వరకు వేయించి రెండింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్‌లో బొంబాయి రవ్వ వేసి మీడియం మంటపై నాలుగైదు నిమిషాలు కలుపుతూ వేయించాలి. రవ్వ మాడిపోకుండా జాగ్రత్తపడాలి. మంచి సువాసన వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

మరో పాత్రలో ఆరు కప్పుల నీటిని మరిగించాలి. వేడి నీటిని వేయించిన రవ్వలో కొద్దికొద్దిగా పోస్తూ మరో చేత్తో నిరంతరం కలపాలి. ఇలా చేయడం వల్ల రవ్వలో ఉండలు ఏర్పడకుండా ఉంటాయి. రవ్వ నీటిని పీల్చుకుని మెత్తగా ఉడికే వరకు తక్కువ మంటపై ఉంచాలి. ఆ తర్వాత పంచదార వేసి పూర్తిగా కరిగేలా కలపాలి. పంచదార వేసినప్పుడు మిశ్రమం కొంత పలుచగా మారవచ్చు. కంగారు పడకుండా మరికొంతసేపు ఉడికిస్తే మళ్లీ చిక్కబడుతుంది.

ఇప్పుడు నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ రవ్వ కేసరి మెత్తగా, మృదువుగా మారే వరకు ఉడికించాలి. కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి బాగా కలపాలి. కేసరి మరీ గట్టిపడకముందే స్టవ్ ఆఫ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు ఇది మెత్తగా ఉంటుంది. చల్లారే కొద్దీ కొంత గట్టిపడుతుంది.

రవ్వ కేసరి రుచిగా రావడానికి చిట్కాలు: రవ్వ, పంచదార, నీటిని కొలవడానికి ఒకే కప్పును ఉపయోగించాలి. రవ్వను సరిగ్గా వేయించడం వల్ల మంచి సువాసన వస్తుంది. వేడి నీటిని ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా కలపాలి. పంచదార, నెయ్యి పరిమాణాన్ని మీ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇలా సరైన కొలతలు, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే మెత్తగా, రుచికరంగా ఉండే రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. పండుగలతో పాటు సాధారణ రోజుల్లోనూ ఈ స్వీట్‌ను కుటుంబ సభ్యులకు అందించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 4:18 pm Digital Edition : Prabhanews
Rava Kesari: రవ్వ కేసరి చేసే అసలైన పద్ధతి ఇదే.. గరిటెకు అతుక్కోకుండా మెత్తగా రావాలంటే ఇలా చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 13, 2026 4:09 PM ISTసరైన కొలతలు పాటించడంతో పాటు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుడిలో ప్రసాదంలా మెత్తగా, రుచిగా ఉండే రవ్వ కేసరిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను కేవలం 10–15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.News18పండుగలు, వ్రతాలు, పూజల సమయంలో దేవతలకు నైవేద్యంగా వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేస్తుంటారు. అలాంటి వాటిలో రవ్వ కేసరికి ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ సమయంలో, ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు రవ్వ కేసరి మరీ గట్టిగా మారడం, నీళ్లలా పలుచగా ఉండటం లేదా రవ్వలో ఉండలు ఏర్పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన కొలతలు పాటించడంతో పాటు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుడిలో ప్రసాదంలా మెత్తగా, రుచిగా ఉండే రవ్వ కేసరిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ స్వీట్‌ను కేవలం 10–15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.కావలసిన పదార్థాలు: ఈ రవ్వ కేసరి తయారీకి రెండు కప్పుల బొంబాయి రవ్వ, మూడు కప్పుల పంచదార, ఆరు కప్పుల నీరు, ఒక కప్పు నెయ్యి, జీడిపప్పు పలుకులు ఐదారు టీస్పూన్లు, కిస్‌మిస్‌లు మూడు టీస్పూన్లు, ఒక టీస్పూన్ యాలకుల పొడి అవసరం. రవ్వను వేయించడానికి కొద్దిగా నెయ్యి అదనంగా తీసుకోవాలి. కేసరికి మంచి రంగు రావాలనుకుంటే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా ఐచ్ఛికం.తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు పలుకులను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత కిస్‌మిస్‌లు వేసి అవి కొద్దిగా ఉబ్బే వరకు వేయించి రెండింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్‌లో బొంబాయి రవ్వ వేసి మీడియం మంటపై నాలుగైదు నిమిషాలు కలుపుతూ వేయించాలి. రవ్వ మాడిపోకుండా జాగ్రత్తపడాలి. మంచి సువాసన వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.మరో పాత్రలో ఆరు కప్పుల నీటిని మరిగించాలి. వేడి నీటిని వేయించిన రవ్వలో కొద్దికొద్దిగా పోస్తూ మరో చేత్తో నిరంతరం కలపాలి. ఇలా చేయడం వల్ల రవ్వలో ఉండలు ఏర్పడకుండా ఉంటాయి. రవ్వ నీటిని పీల్చుకుని మెత్తగా ఉడికే వరకు తక్కువ మంటపై ఉంచాలి. ఆ తర్వాత పంచదార వేసి పూర్తిగా కరిగేలా కలపాలి. పంచదార వేసినప్పుడు మిశ్రమం కొంత పలుచగా మారవచ్చు. కంగారు పడకుండా మరికొంతసేపు ఉడికిస్తే మళ్లీ చిక్కబడుతుంది.ఇప్పుడు నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ రవ్వ కేసరి మెత్తగా, మృదువుగా మారే వరకు ఉడికించాలి. కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి బాగా కలపాలి. కేసరి మరీ గట్టిపడకముందే స్టవ్ ఆఫ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు ఇది మెత్తగా ఉంటుంది. చల్లారే కొద్దీ కొంత గట్టిపడుతుంది.రవ్వ కేసరి రుచిగా రావడానికి చిట్కాలు: రవ్వ, పంచదార, నీటిని కొలవడానికి ఒకే కప్పును ఉపయోగించాలి. రవ్వను సరిగ్గా వేయించడం వల్ల మంచి సువాసన వస్తుంది. వేడి నీటిని ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా కలపాలి. పంచదార, నెయ్యి పరిమాణాన్ని మీ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇలా సరైన కొలతలు, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే మెత్తగా, రుచికరంగా ఉండే రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. పండుగలతో పాటు సాధారణ రోజుల్లోనూ ఈ స్వీట్‌ను కుటుంబ సభ్యులకు అందించవచ్చు.మరింత చదవండి

Source link