ప్రభన్యూస్

Rashmika Mandanna: విజ్జూకి నేనే పెద్ద ఫ్యాన్.. మాకు పెళ్లయిందని అస్సలు అనిపించడం లేదు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తాజాగా జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇంకా పెళ్లి చేసుకున్నా అని అనిపించడం లేదంటూ ఆమె క్రేజీగా రియాక్ట్ అయ్యారు.

News18
News18

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు.

విజయ్ నటన చూసి భయమేసింది:

ప్రీ రిలీజ్ వేడుకలో రష్మిక మాట్లాడుతూ.. స్టేజ్‌పైకి ఎన్నిసార్లు వచ్చినా తనకు టెన్షన్, ఉత్సాహం ఒకేసారి కలుగుతాయని చెప్పారు. అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న రీల్స్, కామెంట్స్, పోస్టులు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ‘రణబాలి’, ‘జయమ్మ’ పాత్రల్లో అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సినిమా కోసం చిత్రబృందం నెలల తరబడి ఎంతో కష్టపడిందని రష్మిక వెల్లడించారు. తాను తన పాత్రకు సంబంధించిన కొన్ని రోజుల షూటింగ్‌లో పాల్గొని తిరిగి వచ్చేదాన్నని, అయితే సెట్‌లో అందరూ ఎంతో సీరియస్‌గా పనిచేసేవారని చెప్పారు. విజయ్ దేవరకొండ మీసాలు తిప్పుతూ తన పాత్రలో నటిస్తున్న తీరు చూసి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.

‘రణబాలి’ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది:

సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని తానేనని రష్మిక చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అక్టోబర్ 16న థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మంచి సినిమాలు చేయాలన్నా, వాటిలో భాగం కావాలన్నా అదృష్టం కూడా ఉండాలని తాను నమ్ముతానని తెలిపారు.

విజయ్‌కి పెద్ద ఫ్యాన్ నేనే..

గతంలో విజయ్, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ‘రణబాలి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా సాధారణ ప్రేమకథ కాదని, ఇందులో అద్భుతమైన ప్రేమకథతో పాటు అంతకంటే విస్తృతమైన కథాంశం ఉంటుందని రష్మిక వివరించారు. జయమ్మ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని, ప్రేక్షకుల హృదయాల్లో కూడా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయ్‌తో పెళ్లి జరిగినప్పటికీ ఆయనపై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని రష్మిక అన్నారు. ఇప్పటికీ విజయ్‌ను చూస్తే ఒక అభిమానిలాగే అనిపిస్తుందని, ఆయన నటనకు తాను పెద్ద ఫ్యాన్‌నని వెల్లడించారు. ‘రణబాలి’లో విజయ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 8:25 am Digital Edition : Prabhanews
Rashmika Mandanna: విజ్జూకి నేనే పెద్ద ఫ్యాన్.. మాకు పెళ్లయిందని అస్సలు అనిపించడం లేదు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 14, 2026 8:21 AM ISTతాజాగా జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇంకా పెళ్లి చేసుకున్నా అని అనిపించడం లేదంటూ ఆమె క్రేజీగా రియాక్ట్ అయ్యారు.
News18విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు.విజయ్ నటన చూసి భయమేసింది:ప్రీ రిలీజ్ వేడుకలో రష్మిక మాట్లాడుతూ.. స్టేజ్‌పైకి ఎన్నిసార్లు వచ్చినా తనకు టెన్షన్, ఉత్సాహం ఒకేసారి కలుగుతాయని చెప్పారు. అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న రీల్స్, కామెంట్స్, పోస్టులు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ‘రణబాలి’, ‘జయమ్మ’ పాత్రల్లో అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు.ఈ సినిమా కోసం చిత్రబృందం నెలల తరబడి ఎంతో కష్టపడిందని రష్మిక వెల్లడించారు. తాను తన పాత్రకు సంబంధించిన కొన్ని రోజుల షూటింగ్‌లో పాల్గొని తిరిగి వచ్చేదాన్నని, అయితే సెట్‌లో అందరూ ఎంతో సీరియస్‌గా పనిచేసేవారని చెప్పారు. విజయ్ దేవరకొండ మీసాలు తిప్పుతూ తన పాత్రలో నటిస్తున్న తీరు చూసి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.‘రణబాలి’ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది:సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని తానేనని రష్మిక చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అక్టోబర్ 16న థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మంచి సినిమాలు చేయాలన్నా, వాటిలో భాగం కావాలన్నా అదృష్టం కూడా ఉండాలని తాను నమ్ముతానని తెలిపారు.విజయ్‌కి పెద్ద ఫ్యాన్ నేనే..గతంలో విజయ్, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ‘రణబాలి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా సాధారణ ప్రేమకథ కాదని, ఇందులో అద్భుతమైన ప్రేమకథతో పాటు అంతకంటే విస్తృతమైన కథాంశం ఉంటుందని రష్మిక వివరించారు. జయమ్మ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని, ప్రేక్షకుల హృదయాల్లో కూడా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విజయ్‌తో పెళ్లి జరిగినప్పటికీ ఆయనపై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని రష్మిక అన్నారు. ఇప్పటికీ విజయ్‌ను చూస్తే ఒక అభిమానిలాగే అనిపిస్తుందని, ఆయన నటనకు తాను పెద్ద ఫ్యాన్‌నని వెల్లడించారు. ‘రణబాలి’లో విజయ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.మరింత చదవండి

Source link