Last Updated:
పెళ్లి తర్వాత తొలిసారి విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా రణబాలి. ఈ రోజే (అక్టోబర్ 16 న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? ఇప్పటికే మూవీ చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
పెళ్లి తర్వాత తొలిసారి విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా రణబాలి. బ్రిటీష్ పాలన సమయంలో రాయలసీమను వెంటాడిన కరువు, ప్రజల కష్టాలను నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ స్టోరీగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అర్నాల్డ్ వాస్లూ, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలున్నాయి. మరి ఈ రోజే (అక్టోబర్ 16 న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? ఇప్పటికే మూవీ చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు ట్విట్టర్ నుంచి వినిపిస్తున్న ఓవర్సీస్ టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోందని అర్థమవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాస, డైలాగ్ డెలివరీ, నటన అన్నీ చాలా బాగా కుదిరాయని అంటున్నారు. విజయ్-రష్మిక కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య సన్నివేశాలు సూపర్ అని చెబుతున్నారు. మరికొందరు నెమ్మదిగా సాగే కథనం, భారీ రన్‌టైమ్ ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటున్నారు. ఫస్టాఫ్ అంతా చాలా స్లోగా సాగిపోయిందట. సెకండాఫ్ మాత్రం సూపర్బ్ అని.. విజువల్లీ గ్రాండ్ కానీ, అనుకున్నంత కిక్ అయితే ఇవ్వలేదు అనే ట్వీట్స్ కనిపిస్తున్నాయి.
#RanabaaliReview 🎬
Visually Grand… కానీ, అనుకున్నంతగా కిక్ ఇవ్వలేదు! 📉
#ShyamSinghaRoy తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ #Ranabaali తో ఇంకో visually strong period drama ఇచ్చారు. World-building, period setting, art design అండ్ cinematography ఈ సినిమాకి మేజర్ అసెట్స్. అయితే, సినిమాలో ప్రొడక్షన్ పరంగా అన్నీ ఉన్నా కూడా “ఏదో మిస్ అయినట్టు” ఒక incomplete feeling అయితే మిగిలిపోతుంది.What Works:
Vijay’s Effort & Action: Cave fight sequence తో పాటు ప్రొడక్షన్ వ్యాల్యూస్, యాక్షన్ బ్లాక్స్ చాలా గ్రాండ్‌గా డిజైన్ చేశారు. విజయ్ పెట్టిన డెడికేషన్ అండ్ ఎఫర్ట్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తుంది.Technical Quality: World-building, rich visuals అండ్ ఆర్ట్ వర్క్ సినిమాకి చాలా గ్రాండ్ లుక్ తీసుకొచ్చాయి.
What Could Be Better:
Forced Expressions & Modulation: కొన్ని సీన్స్ లో విజయ్ ఇచ్చే expressions అండ్ voice modulation కాస్త forced గా అనిపిస్తాయి.Slow Narration & Weak BGM: నేరేషన్ బాగా స్లో అవ్వడం, కథనం రొటీన్‌గా అనిపించడం… దానికి తోడు సీన్స్‌ని ఎలివేట్ చేయాల్సిన BGM కూడా తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది.
Final Verdict: Crisp editing అండ్ టైట్ స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే సినిమా కాస్త ఎంగేజింగ్ గా ఉండేది. మాస్ ఆడియన్స్‌కి ఈ కంటెంట్ క్లిక్ అయితే ఓకే, లేదంటే బాక్సాఫీస్ దగ్గర సినిమాకి Tough Ride తప్పదు! 🤞
#RanaBaali #VijayDeverakonda #RahulSankrityan #MovieReview— Janya Digital Media (@janyamedia1) October 15, 2026
#Ranabaali Honest Intentions, Patience Testing Execution!
The director sincerely tries to tell real stories/events set against a beaten to death British backdrop, but the dead slow screenplay and flat narration test your patience. VD-Rashmika’s portions provide some relief and are the film’s main highlight, but the film lacks the emotional connect a subject like this needs and feels lifeless and tiring for long stretches.Production values and set design stand out. VD’s effort is visible and he gives a sincere performance, though his characterization and histrionics feel odd at times. BGM is a huge letdown, and the film badly needs trimming. Sincere effort, but a strictly boring watch.
Rating: 2/5
— Venky Reviews (@venkyreviews) October 16, 2026
#Ranabaali Honest Intentions, Grand Making!
The director makes a sincere attempt to bring real stories and events to life against a British-era backdrop. VD and Rashmika’s portions bring good moments, while their chemistry adds to the film’s appeal. Vijay Deverakonda delivers a sincere performance, and the production values and set design stand out. Though the slow narration affects the flow, the film shows genuine effort and ambition.— Filmyscoops (@Filmyscoopss) October 16, 2026
కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ స్టోరీని నేరేట్ చేసిన విధానం చాలా బాగుందని కొందరు చెబుతున్నారు. జయమ్మ కూడా ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టిందని, సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం అంటున్నారు. ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు అసలైన ఆసెట్స్ అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి కథను వెండితెరపైకి తీసుకొచ్చి ప్రెజెంట్ చేయడం పెద్ద సాహసమే అనేవారు కూడా ఉన్నారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయని అంటున్నారు. సో, చూడాలి మరి ఇలాంటి మిశ్రమ స్పందన నడుమ రణబాలి ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనేది.

