Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి గంట ముందు ఏం జరిగింది? కన్నీళ్లు పెట్టించే చేదు నిజాలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

2021లో పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం యావత్ సినీ లోకాన్ని కుదిపేసింది. అయితే ఆయన మరణానికి గంటన్నర ముందు ఏం జరిగింది? ఎలా మరణించారు? అనే విషయాలు తాజాగా ఆయన పర్సనల్ వెల్లడించడంతో మరోసారి పునీత్ రాజ్‌కుమార్ డెత్ హాట్ టాపిక్ అయింది.

News18
News18

కన్నడ కంఠీరవ, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం భారతీయ సినీ పరిశ్రమను ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో, ఎంతో యాక్టివ్‌గా, ఫిట్‌గా కనిపించే ‘అప్పు’ 2021లో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కచ్చితత్వంతో వ్యవహరించే పునీత్ లాంటి వ్యక్తికి ఈ పరిస్థితి ఎలా ఎదురైంది? ఆ దుర్దినం ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుండి ఆసుపత్రికి చేరేలోపు ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది? అనే విషయాలపై ఆయన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు తాజాగా కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టారు.

డాక్టర్ రమణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పునీత్ రాజ్‌కుమార్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ జిమ్‌లో వ్యాయామం చేస్తుంటారు. అయితే ఆ రోజు ఉదయం ఆయన తన రెగ్యులర్ వర్కవుట్‌లకు భిన్నంగా మొదటిసారి ‘కిక్‌బాక్సింగ్’ సాధన చేశారు. ఎలాంటి విరామం లేకుండా దాదాపు గంటన్నర పాటు అత్యంత కఠినమైన స్థాయిలో ఈ కసరత్తులు చేశారు. ఈ ఎక్స్‌ట్రీమ్ వర్కవుట్ కారణంగా ఆయన శరీరం, గుండెపై విపరీతమైన భారం పడింది. అసాధారణ రీతిలో అలసటకు గురై, శరీరం మొత్తం చెమటలు పట్టేయడంతో ఏదో అసౌకర్యంగా ఉందని పునీత్ గ్రహించారు. వెంటనే ఉదయం 11 గంటల సమయంలో తన భార్య అశ్వినితో కలిసి కుటుంబ వైద్యుడైన డాక్టర్ రమణారావు క్లినిక్‌కు వెళ్లారు.

క్లినిక్‌లో పునీత్‌ను పరీక్షించినప్పుడు ఆయన రక్తపోటు (బీపీ) సాధారణ స్థాయిలోనే నమోదైంది. కానీ పరిస్థితి తీవ్రతను క్షుణ్ణంగా అంచనా వేసేందుకు వెంటనే ఈసీజీ (ECG) తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్టర్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు కనిపించాయి. పునీత్ గుండె అప్పటికే తీవ్రమైన ఒత్తిడికి (Cardiac Strain) లోనవుతున్నట్లు ఈసీజీ స్పష్టంగా హెచ్చరించింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన డాక్టర్ రమణారావు, తక్షణం అత్యవసర చికిత్స కోసం నగరంలోని విక్రమ్ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ కోసం వేచి చూస్తే అత్యంత విలువైన సమయం వృథా అవుతుందనే ఉద్దేశ్యంతో, వారి సొంత కారులోనే వెంటనే ఆసుపత్రికి బయలుదేరమన్నారు.

ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కారు వేగంగానే ప్రయాణించింది. కానీ విధి ఆడిన నాటకంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. విక్రమ్ ఆసుపత్రి గేటుకు చేరుకోవడానికి కేవలం ఒక్క నిమిషం ముందు, కారులోనే పునీత్ రాజ్‌కుమార్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకోగానే, వైద్య బృందం వెంటనే స్పందించి అత్యవసర విభాగానికి తరలించింది. సీపీఆర్ (CPR) సహా అత్యంత అధునాతన లైఫ్ సపోర్ట్ విధానాల ద్వారా ఆయన గుండెను తిరిగి ఆడిందేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. శృతిమించిన వ్యాయామం ఒక అద్భుతమైన నటుడిని మనకు కాకుండా చేసిందని, ఆ ఒక్క నిమిషం వ్యవధి ఆయన ప్రాణాలను గాల్లో కలిపేసిందని డాక్టర్ రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ పేరిట మితిమీరిన కసరత్తులు గుండెపై ఎంతటి ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 3:13 pm Digital Edition : Prabhanews
Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి గంట ముందు ఏం జరిగింది? కన్నీళ్లు పెట్టించే చేదు నిజాలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 3:11 PM IST2021లో పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం యావత్ సినీ లోకాన్ని కుదిపేసింది. అయితే ఆయన మరణానికి గంటన్నర ముందు ఏం జరిగింది? ఎలా మరణించారు? అనే విషయాలు తాజాగా ఆయన పర్సనల్ వెల్లడించడంతో మరోసారి పునీత్ రాజ్‌కుమార్ డెత్ హాట్ టాపిక్ అయింది. News18కన్నడ కంఠీరవ, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం భారతీయ సినీ పరిశ్రమను ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో, ఎంతో యాక్టివ్‌గా, ఫిట్‌గా కనిపించే 'అప్పు' 2021లో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కచ్చితత్వంతో వ్యవహరించే పునీత్ లాంటి వ్యక్తికి ఈ పరిస్థితి ఎలా ఎదురైంది? ఆ దుర్దినం ఉదయం ఆయన ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుండి ఆసుపత్రికి చేరేలోపు ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది? అనే విషయాలపై ఆయన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు తాజాగా కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టారు.డాక్టర్ రమణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పునీత్ రాజ్‌కుమార్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ జిమ్‌లో వ్యాయామం చేస్తుంటారు. అయితే ఆ రోజు ఉదయం ఆయన తన రెగ్యులర్ వర్కవుట్‌లకు భిన్నంగా మొదటిసారి 'కిక్‌బాక్సింగ్' సాధన చేశారు. ఎలాంటి విరామం లేకుండా దాదాపు గంటన్నర పాటు అత్యంత కఠినమైన స్థాయిలో ఈ కసరత్తులు చేశారు. ఈ ఎక్స్‌ట్రీమ్ వర్కవుట్ కారణంగా ఆయన శరీరం, గుండెపై విపరీతమైన భారం పడింది. అసాధారణ రీతిలో అలసటకు గురై, శరీరం మొత్తం చెమటలు పట్టేయడంతో ఏదో అసౌకర్యంగా ఉందని పునీత్ గ్రహించారు. వెంటనే ఉదయం 11 గంటల సమయంలో తన భార్య అశ్వినితో కలిసి కుటుంబ వైద్యుడైన డాక్టర్ రమణారావు క్లినిక్‌కు వెళ్లారు.క్లినిక్‌లో పునీత్‌ను పరీక్షించినప్పుడు ఆయన రక్తపోటు (బీపీ) సాధారణ స్థాయిలోనే నమోదైంది. కానీ పరిస్థితి తీవ్రతను క్షుణ్ణంగా అంచనా వేసేందుకు వెంటనే ఈసీజీ (ECG) తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్టర్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు కనిపించాయి. పునీత్ గుండె అప్పటికే తీవ్రమైన ఒత్తిడికి (Cardiac Strain) లోనవుతున్నట్లు ఈసీజీ స్పష్టంగా హెచ్చరించింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన డాక్టర్ రమణారావు, తక్షణం అత్యవసర చికిత్స కోసం నగరంలోని విక్రమ్ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ కోసం వేచి చూస్తే అత్యంత విలువైన సమయం వృథా అవుతుందనే ఉద్దేశ్యంతో, వారి సొంత కారులోనే వెంటనే ఆసుపత్రికి బయలుదేరమన్నారు.ఆసుపత్రికి వెళ్లే మార్గంలో కారు వేగంగానే ప్రయాణించింది. కానీ విధి ఆడిన నాటకంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. విక్రమ్ ఆసుపత్రి గేటుకు చేరుకోవడానికి కేవలం ఒక్క నిమిషం ముందు, కారులోనే పునీత్ రాజ్‌కుమార్ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకోగానే, వైద్య బృందం వెంటనే స్పందించి అత్యవసర విభాగానికి తరలించింది. సీపీఆర్ (CPR) సహా అత్యంత అధునాతన లైఫ్ సపోర్ట్ విధానాల ద్వారా ఆయన గుండెను తిరిగి ఆడిందేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. శృతిమించిన వ్యాయామం ఒక అద్భుతమైన నటుడిని మనకు కాకుండా చేసిందని, ఆ ఒక్క నిమిషం వ్యవధి ఆయన ప్రాణాలను గాల్లో కలిపేసిందని డాక్టర్ రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ పేరిట మితిమీరిన కసరత్తులు గుండెపై ఎంతటి ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరింత చదవండి

Source link