Last Updated:
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా’స్పిరిట్’ మూవీపైనే అభిమానుల ఆశలన్నీ. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్ వేసుకోవడంతో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా’స్పిరిట్’ మూవీపైనే అభిమానుల ఆశలన్నీ. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు ప్రభాస్ తొలిసారిగా ఖాకీ డ్రెస్ వేసుకోవడంతో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. మాములుగానే సందీప్ రెడ్డి వంగా హీరో పాత్రలకు యాటిట్యూడ్ టన్నుల్లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పోలీస్ పాత్ర.. అందులోనే డార్లింగ్‌తో రోల్ అంటే పీక్స్‌లో ఉంటుంది. అసలు ఎలాంటి విజువల్స్ లేకుండానే ఒక్క డైలాగ్‌తో ఇండియాను షేక్ చేశాడంటే మాములు విషయం కాదు.
మరోవైపు అదే ఆడియో గ్లింప్స్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని సందీప్ రెడ్డి వంగా చూపించడం బాలీవుడ్‌కు అస్సలు మింగుడు పడలేదు. ఇక న్యూఇయర్‌కు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొత్తం దేశంలోనే సంచలనం సృష్టించింది. డార్లింగ్ ఫ్యాన్స్ అసలైన న్యూ ఇయర్ ఈ పోస్టర్‌తోనే స్టార్ట్ అయింది. అసలు ఆ ఫస్ట్‌లుక్‌ను ఎంత మంది డీపీలుగా, వాల్ పేపర్లుగా ఆ టైమ్‌లో పెట్టుకున్నారో లెక్కేలేదు. అంతలా పిచ్చిక్కిపోయేలా చేశాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను ముందుగా మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సందీప్ కూడా బయటే ఏ ప్రెస్ మీట్లో కనిపించినా మార్చి 5నే స్పిరిట్ వస్తుందని నొక్కి నొక్కి చెప్పాడు. కాగా తాజాగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రివీల్ చేస్తూ కొత్త డేట్‌ను ప్రకటించాడు. డార్లింగ్ క్యాప్ పెట్టుకుని క్యాజువల్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా సినిమాను ఏకంగా 8 నెలలు పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.
Check this out…….. 😊
#Spirit
#InSpiritMode
@TSeries
@VangaPictures
#IndiasBiggestSuperStar
29TH OCTOBER DIWALI 2027 💥
Worldwide RELEASE DATE 👆 https://t.co/SmPjKHzuVE
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 18, 2026
ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే సరిగ్గా ఇంకా ఏడాదికి పైగానే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. ఆల్రెడీ చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ మార్చిలో స్పిరిట్ పక్కా అని ఫిక్సయిపోయారు. అలాంటి టైమ్‌లో ఏకంగా 8 నెలలు పోస్ట్ పోన్ చేసి చావు దెబ్బ కొట్టేశాడు సందీప్ అన్న. కొందరు మాత్రం ఎప్పుడొచ్చిన స్పిరిట్ సినిమా రికార్డులు తిరగరాయడం పక్కా.. వచ్చే ఏడాది దీపావళికి క్రాకర్స్ కూడా అవసరం లేదు అంటూ మాస్ లెవల్ ఎలివేషన్లు ఇస్తున్నారు.
ప్రభాస్ ఈ సినిమాలో రూత్ లెస్ కాప్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తుంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్కు మాములు రెస్పాన్స్ రాలేదు. ఇక స్పిరిట్ తాండవం చూడాలంటే ఇంకా ఏడాది వేయిట్ చేయాల్సిందే….

