Last Updated:
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల్లో కీలక దౌత్య పర్యటనకు బయలుదేరనున్నారు.
ఆగస్టు 29 నుంచి 30 వరకు ఉజ్బెకిస్థాన్‌లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన చేపట్టనున్న ప్రధాని, అనంతరం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రిపబ్లిక్‌లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

