Last Updated:
Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఏమైనా మార్పు జరిగిందా? కంపెనీలు రేట్లు పెంచాయా.. లేక ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అక్టోబర్ 30న అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.
ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రూడ్ ధరలు ఇప్పుడు మళ్లీ 100 డాలర్లపైనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై తాజాగా కేంద్రం నిర్ణయాలు తీసుకుందా?. కంపెనీలు రేట్లు పెంచాయా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి…. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. మరోవైపు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరల్లోనూ గత ఆగస్టుతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రాష్ట్రాల పన్నుల్లో మార్పులు ఉంటే భవిష్యత్తులో ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అక్టోబర్ 30న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69గా కొనసాగుతోంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.82గా ఉంది. రాష్ట్రంలోని ఇతర నగరాలు, జిల్లాల్లో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, స్థానిక పన్నుల నిర్మాణాన్ని బట్టి కొద్దిపాటి వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని చమురు సంస్థలు పేర్కొంటున్నాయి. విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్‌కు రూ.116.39, డీజిల్ రూ.104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 కాగా, డీజిల్ ధర రూ.104.96గా కొనసాగుతోంది. అంటే మూడు ప్రధాన నగరాల్లోనూ ఈరోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల మధ్య మారడానికి ప్రధాన కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ముఖ్యంగా వ్యాట్, ఒకటి. వీటితో పాటు రవాణా ఖర్చులు, డీలర్ కమిషన్లు కూడా తుది ధరను ప్రభావితం చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ప్రస్తుతం వస్తు సేవల పన్ను (GST) పరిధిలో లేవు. అందువల్ల రాష్ట్రాల పన్నుల విధానం ధరల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తోంది.
అంతర్జాతీయ ముడిచమురు ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా భారత ఇంధన ధరలకు ముఖ్యమైన అంశాలు. భారత్ తన ముడిచమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నందున అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, రూపాయి మారకం విలువలో మార్పులు ఇక్కడి ఇంధన వ్యయంపై ప్రభావం చూపుతాయి. సెప్టెంబర్‌లో భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ చమురు ధరలు అధిక స్థాయిలో ఉండగా, ఇటీవలి రోజుల్లో వాటిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
గమనిక: మీ నగరంలోని ఇండియన్ ఆయిల్ బంకుల్లో అమలులో ఉన్న తాజా ధరలను మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం RSP <స్పేస్> డీలర్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు SMS పంపాలి. హైదరాబాద్‌కు 134483, విజయవాడకు 127611, విశాఖపట్నానికి 127290 డీలర్ కోడ్లను ఉపయోగించాలి. వెంటనే మీ ప్రాంతంలోని లైవ్ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్‌కు సందేశంగా అందుతాయి. దీంతో ప్రతి రోజు ఇంధన ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

