ప్రభన్యూస్

Parenting Tips: పిల్లలకు ఆధ్యాత్మికతను ఎలా నేర్పించాలి?.. పేరెంట్స్ ఈ విషయాలను తప్పక తెలుసుకోండి! | లైఫ్ స్టైల్


Last Updated:

కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులతో మంచిగా ఉండటం వంటి విషయాలను నేర్చుకుంటారు. అయితే పిల్లలకు ఆధ్యాత్మికతను నేర్పించే విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

News18
News18

పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో, మంచి విలువలు, ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా అంతే ముఖ్యం. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పిస్తే వారు జీవితంలో సరైన మార్గంలో నడవడానికి సహాయపడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులతో మంచిగా ఉండటం వంటి విషయాలను నేర్చుకుంటారు. అయితే పిల్లలకు ఆధ్యాత్మికతను నేర్పించే విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. బలవంతం చేయకుండా, వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యమని సైకాలజిస్ట్ హరీశ్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి

పిల్లలకు ఏదైనా ఆచారం లేదా సంప్రదాయం గురించి చెప్పే ముందు దాని అర్థం ఏమిటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. చాలామంది ఇతరులను చూసి ఆచారాలను పాటిస్తుంటారు. కానీ వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడం కూడా అవసరం. పిల్లలకు ఎందుకు పూజలు చేస్తారు? పండుగలను ఎందుకు జరుపుకుంటారు? పెద్దలను ఎందుకు గౌరవించాలి? వంటి విషయాలను సులభంగా వివరించాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు వాటిని అర్థం చేసుకుని ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

చిన్నచిన్న కథలు చెప్పాలి

రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలు, పురాణాల్లో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. వాటిలోని కథలను పిల్లలకు సులభమైన భాషలో చెప్పవచ్చు. నిజాయితీగా ఉండటం, ఇతరులకు సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ధైర్యంగా ఉండటం వంటి విలువలను కథల ద్వారా నేర్పించవచ్చు. కథ చెప్పిన తర్వాత అందులోని మంచి విషయం ఏమిటో పిల్లలతో చర్చిస్తే వారు మరింత బాగా అర్థం చేసుకుంటారు.

తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండాలి

పిల్లలు తల్లిదండ్రులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు మంచి అలవాట్లను ముందుగా తమ జీవితంలో పాటించాలి. ఇతరులతో మర్యాదగా మాట్లాడటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, నిజం చెప్పడం, పెద్దలను గౌరవించడం వంటి పనులను పిల్లల ముందు ఆచరించాలి. కేవలం మాటలతో చెప్పడం కంటే మనం చేసి చూపించడం ద్వారా పిల్లలు త్వరగా నేర్చుకుంటారు.

ధ్యానం అలవాటు చేయాలి

పిల్లలకు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం వంటి సులభమైన ధ్యాన పద్ధతులను అలవాటు చేయవచ్చు. మొదట రెండు నుంచి ఐదు నిమిషాలతో ప్రారంభించి, వారికి ఆసక్తి పెరిగే కొద్దీ సమయాన్ని పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం వంటి ప్రయోజనాలు కలగవచ్చు. అయితే పిల్లలకు ఇష్టం లేకపోతే బలవంతం చేయకూడదు.

చదువుకు ఆటంకం కలగకూడదు

పిల్లలకు ఆధ్యాత్మికతను నేర్పించే సమయంలో వారి చదువు, ఆటలు, విశ్రాంతికి తగిన సమయం ఉండేలా చూడాలి. ఎక్కువ సమయం పట్టే కార్యక్రమాలను సెలవు రోజుల్లో నిర్వహించవచ్చు. ప్రతిరోజూ కొద్దిసేపు ప్రార్థన, మంచి కథలు లేదా కుటుంబ సభ్యులతో విలువల గురించి మాట్లాడుకోవడం సరిపోతుంది. పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా, వారి వయసుకు తగిన విధంగా నేర్పించాలి. ముఖ్యంగా ఇతరుల నమ్మకాలను గౌరవించడం, ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు పెంపొందించవచ్చు. ఇలా ప్రేమతో, ఓపికతో నేర్పిస్తే పిల్లలు మంచి విలువలను అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 7:20 pm Digital Edition : Prabhanews
Parenting Tips: పిల్లలకు ఆధ్యాత్మికతను ఎలా నేర్పించాలి?.. పేరెంట్స్ ఈ విషయాలను తప్పక తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 14, 2026 7:14 PM ISTకష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులతో మంచిగా ఉండటం వంటి విషయాలను నేర్చుకుంటారు. అయితే పిల్లలకు ఆధ్యాత్మికతను నేర్పించే విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.News18పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో, మంచి విలువలు, ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా అంతే ముఖ్యం. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పిస్తే వారు జీవితంలో సరైన మార్గంలో నడవడానికి సహాయపడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులతో మంచిగా ఉండటం వంటి విషయాలను నేర్చుకుంటారు. అయితే పిల్లలకు ఆధ్యాత్మికతను నేర్పించే విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. బలవంతం చేయకుండా, వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యమని సైకాలజిస్ట్ హరీశ్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలిపిల్లలకు ఏదైనా ఆచారం లేదా సంప్రదాయం గురించి చెప్పే ముందు దాని అర్థం ఏమిటో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. చాలామంది ఇతరులను చూసి ఆచారాలను పాటిస్తుంటారు. కానీ వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడం కూడా అవసరం. పిల్లలకు ఎందుకు పూజలు చేస్తారు? పండుగలను ఎందుకు జరుపుకుంటారు? పెద్దలను ఎందుకు గౌరవించాలి? వంటి విషయాలను సులభంగా వివరించాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు వాటిని అర్థం చేసుకుని ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.చిన్నచిన్న కథలు చెప్పాలిరామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలు, పురాణాల్లో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. వాటిలోని కథలను పిల్లలకు సులభమైన భాషలో చెప్పవచ్చు. నిజాయితీగా ఉండటం, ఇతరులకు సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ధైర్యంగా ఉండటం వంటి విలువలను కథల ద్వారా నేర్పించవచ్చు. కథ చెప్పిన తర్వాత అందులోని మంచి విషయం ఏమిటో పిల్లలతో చర్చిస్తే వారు మరింత బాగా అర్థం చేసుకుంటారు.తల్లిదండ్రులే ఆదర్శంగా ఉండాలిపిల్లలు తల్లిదండ్రులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు మంచి అలవాట్లను ముందుగా తమ జీవితంలో పాటించాలి. ఇతరులతో మర్యాదగా మాట్లాడటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, నిజం చెప్పడం, పెద్దలను గౌరవించడం వంటి పనులను పిల్లల ముందు ఆచరించాలి. కేవలం మాటలతో చెప్పడం కంటే మనం చేసి చూపించడం ద్వారా పిల్లలు త్వరగా నేర్చుకుంటారు.ధ్యానం అలవాటు చేయాలిపిల్లలకు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం వంటి సులభమైన ధ్యాన పద్ధతులను అలవాటు చేయవచ్చు. మొదట రెండు నుంచి ఐదు నిమిషాలతో ప్రారంభించి, వారికి ఆసక్తి పెరిగే కొద్దీ సమయాన్ని పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం వంటి ప్రయోజనాలు కలగవచ్చు. అయితే పిల్లలకు ఇష్టం లేకపోతే బలవంతం చేయకూడదు.చదువుకు ఆటంకం కలగకూడదుపిల్లలకు ఆధ్యాత్మికతను నేర్పించే సమయంలో వారి చదువు, ఆటలు, విశ్రాంతికి తగిన సమయం ఉండేలా చూడాలి. ఎక్కువ సమయం పట్టే కార్యక్రమాలను సెలవు రోజుల్లో నిర్వహించవచ్చు. ప్రతిరోజూ కొద్దిసేపు ప్రార్థన, మంచి కథలు లేదా కుటుంబ సభ్యులతో విలువల గురించి మాట్లాడుకోవడం సరిపోతుంది. పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా, వారి వయసుకు తగిన విధంగా నేర్పించాలి. ముఖ్యంగా ఇతరుల నమ్మకాలను గౌరవించడం, ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు పెంపొందించవచ్చు. ఇలా ప్రేమతో, ఓపికతో నేర్పిస్తే పిల్లలు మంచి విలువలను అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.మరింత చదవండి

Source link