Last Updated:
Pappu Charu Recipe: పప్పు చారు చేయడం ఇంత ఈజీనా? వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పక్కన ఆవకాయ ఉంటే ఆ రుచే వేరు! బ్యాచిలర్స్ సైతం సులభంగా చేసుకోగలిగే ఈ ఘుమఘుమలాడే పప్పు చారు రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Pappu Charu Recipe: మన తెలుగు వారి సంప్రదాయ భోజనంలో పప్పు చారుకు ఉండే స్థానమే వేరు. ఘుమఘుమలాడే పప్పు చారు, వేడి వేడి అన్నం, కాసింత నెయ్యి, నంజుకోవడానికి ముక్కల ఆవకాయ పచ్చడి ఉంటే చాలు.. ఎంతటి వారైనా అమృతంలా లొట్టలేసుకుంటూ తింటారు. పప్పును సరైన పద్ధతిలో ఉడికించి, మునక్కాయలు, టమాటాలు, చింతపండు రసంతో మరగబెట్టి ఘాటైన తాలింపు వేస్తే ఇల్లంతా సువాసనలతో నిండిపోతుంది. బ్యాచిలర్స్ సైతం ఎంతో సులభంగా, అద్భుతమైన రుచితో చేసుకోగలిగే ఆ పక్కా పప్పు చారు తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

