మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్ వంటి దక్షిణాది దిగ్గజాలు నటించిన ‘పేట్రియాట్’ సినిమా కథ ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ నిఘా, డేటా భద్రత, దేశ రక్షణ వ్యవస్థల దుర్వినియోగం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో మమ్ముట్టి సైంటిస్ట్‌గా, ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించగా, మోహన్‌లాల్ ఒక ప్రత్యేక పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

