Last Updated:
అమెరికాలో 9/11 దాడులు జరగడానికి కొన్నేళ్ల ముందే భారత్‌లోనూ విధ్వంసం సృష్టించాలని అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కుట్ర పన్నాడని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ విడుదల చేసిన రహస్య పత్రాలు వెల్లడించాయి.
అమెరికాపై జరిగిన భయానక 9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) అత్యంత కీలక పత్రాలను బహిర్గతం చేసింది. ఈ పత్రాల్లో భారత్‌కు సంబంధించిన ఒక సంచలన నిజం బయటపడింది. అమెరికాలో దాడులకు కొన్నేళ్ల ముందే భారత్‌ను తన ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ కుట్ర పన్నినట్లు ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1998 ఆగస్టు 28 నాటి ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం పాకిస్థాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పాటు భారత్‌లోనూ దాడులు జరపాలని లాడెన్ ప్రణాళికలు రచించాడు.

