దసరా పండుగ సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ఆడియో డివైజ్ కొనాలని చూస్తున్న వారికి వన్‌ప్లస్ గుడ్ న్యూస్ చెప్పింది. వన్‌ప్లస్ ఇండియా ఫెస్టివ్ సేల్ అక్టోబర్ 8న, ప్రైమ్ మెంబర్స్‌కి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 7న ప్రారంభమవుతాయి. ఈ సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్స్‌పై ధర తగ్గింపులతో పాటు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ, ప్రత్యేక పండుగ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ భాగస్వామ్య స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి. (image: OnePlus India)

