Last Updated:
NSDC Skill Development: AI, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో కెరీర్ చేయాలనుకునే యువతకు కేంద్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 1.50 లక్షల మందికి ఉచిత శిక్షణతో పాటు, ఎంపికైన 10 వేల మందికి ప్రత్యేక ట్రైనింగ్, సర్టిఫికేషన్, ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలు అందించనున్నారు.
భారతదేశంలో యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) మార్గదర్శకత్వంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC), కల్టస్ ఎడ్యుకేషన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కలిసి దేశవ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.

